ఫోటో స్టొరీ: డీసెంట్ అవతారంలో కియారా

Update: 2019-03-10 17:30 GMT
చేసిన సినిమాలు అరడజనే... అందులోనూ హిందీ సినిమాలు మూడే కానీ కియారా అద్వాని బాలీవుడ్ లో క్రేజీ బ్యూటీగా మారిపోయింది. అసలు ఇలాంటి క్రేజ్ రావడానికి ముఖ్యమైన కారణం అమ్మడు నటించిన 'లస్ట్ స్టోరీస్' వెబ్ సీరీసే.  వైబ్రేటర్ సీన్ లో ఆస్కార్ అవార్డు లెవెల్ నటన కనబరచడంతో వెర్రెత్తిన యూత్ ఆమెకు పర్మనెంట్ అభిమానులుగా మారిపోయారు.

జస్ట్ లస్ట్ స్టొరీస్.. ఇంకేమీ లేదనుకుంటే పొరపాటే.  తన ఫోటోషూట్లతో ఊటిలాంటి చల్లటి సోషల్ మీడియాలో రామగుండం ఓపెన్ క్యాస్ట్ గనుల్లో ఉండే వేడిని పుట్టిస్తోంది. అంతటితో ఊరుకోకుండా కొలిమిలో వేడిని కంటిన్యూ చేసేందుకు రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ఫోటోలను అప్లోడ్ చేస్తూ ఉంటుంది.  కియారాకు ఉన్న మరో గ్రేట్ క్వాలిటీ ఏంటంటే ఈ భామ హాట్ + డీసెంట్.  హాట్ డ్రెస్ వేసుకుంటే సన్నీ లియోన్ టైపులో.. డీసెంట్ డ్రెస్ వేసుకుంటే పద్ధతైన పక్కింటి అమ్మాయిలా కన్పించడం కియారాకు వెన్నతో పెట్టిన విద్య.  తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది కియారా.  క్రీమ్ కలర్ టాప్.. అదే కలర్ లెహంగాలో కుందనపు బొమ్మలా ఉంది.  చేతికి పెద్ద గాజులు.. వేలికి వెడల్పాటి రింగు.. మెడలో షార్ట్ నెక్లెస్..మ్యాచింగ్ ఇయర్ రింగ్స్.. పాపిటబిళ్ళ అన్నీ ఉన్నాయి.  జుట్టుకు ముడేసుకొని.. కొప్పుకు పూలు కూడా పెట్టుకుంది. ఇక స్మైల్ చూస్తుంటే ఎవరికైనా సండే రోజు చికెనూ మటనూ వదిలేసి అమ్మడి ఫోటోనే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది.  

పాప డీసెంట్ గెటప్ లో ఉండడంతో ఒక నెటిజనుడు 'కియారా డీసెంట్' అనే క్యాప్షన్ ఇచ్చాడు.  ఇప్పుడే ఏమైంది? కాస్త ఆగితే లోపల నుండి లస్ట్ ను బయటకు తీసే ఫోటోతో మళ్ళీ విరుచుకుపడుతుంది.    ఇక కియారా ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే 'అర్జున్ రెడ్డి' హిందీ రీమేక్ 'కబీర్ సింగ్'.. 'కళంక్'.. 'గుడ్ న్యూస్' చిత్రాలలో నటిస్తోంది.  ఇవే కాదు.. అక్షయ్ కుమార్ హీరోగా లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'కాంచన' హిందీ రీమేక్ లో హీరోయిన్ ఆఫర్ కూడా వచ్చిందట. 
Tags:    

Similar News