ఎవరో తనని వెంటాడి వేధించినట్టు.. తన భవనంలో ప్రవేశించి పీడించినట్టు ఫీలైందట అందాల కియరా అద్వాణీ. అయితే ఈ ఫియర్ ఎందుకు? అని ప్రశ్నిస్తే అందుకు వేరే ఆసక్తికర సమాధానం చెప్పింది. గత కొన్నేళ్లుగా కియారా అద్వానీ ప్రతిభను నమ్ముకుని తన ఖ్యాతిని పెంచుకుంటూనే ఉంది. చిన్న పాత్రల నుండి మొదలై పెద్ద బ్యానర్ ప్రాజెక్టుల్లో నటించింది. నెమ్మదిగా కెరీర్ పరంగా వెలుగులు విరజిమ్ముతోంది. నెట్‌ఫ్లిక్స్ `లస్ట్ స్టోరీస్` తనకు మేలి మలుపు. అందులో కియరా రూల్స్ ని బ్రేక్ చేసి నటించిన తీరు కుర్రకారుకు కిర్రెక్కించింది. నెట్ ఫ్లిక్స్ సిరీస్ పెద్ద సక్సెస్ అవ్వడంలో కియరా పాత్రను ఎవరూ మరువలేరు. 2019 మరో బిగ్ టర్నింగ్ పాయింట్. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ .. గుడ్ న్యూజ్ లాంటి రెండు బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది. ఇప్పటికి తన సీన్ మారిందని.. ఇకపై సత్తా చాటగలననే నమ్మకం కలిగిందని చెబుతోంది కియరా.
అప్పటివరకూ తనను ఎవరో వెంబడించి కొట్టినట్టు ఫీలయ్యేదట. తాజాగా కాస్మోపాలిటన్ మ్యాగజైన్ ఏప్రిల్ 2020 సంచిక ముఖచిత్రంగా కియారా అద్వానీ దర్శనమిచ్చింది. ఈ ఇంటర్వ్యూలో రకరకాల అనుభవాల్ని షేర్ చేసుకుంది. ఒకప్పుడు వెంటపడే స్టాకర్ (కొట్టేవాళ్లు) ఉన్నారట. కబీర్ సింగ్ తర్వాత ప్రేక్షకుల అభిమానం ప్రేమ దక్కాయి. గుడ్ న్యూజ్ తర్వాత ఇంకా పరిణతి వచ్చింది. నాపై నాకు నమ్మకం పెరిగింది అని తెలిపింది. ఒక రకంగా సామాజిక మాధ్యమాల్లో తనని వెంటాడే వాళ్లను స్టాకర్స్ అని భావిస్తోందా? అంటే అవుననే తన ఉద్ధేశం. నన్ను అనుసరించే అభిమానుల గురించి చింతించకుండా.. నేను ఇకపై స్వేచ్ఛగా తిరగలేనని గ్రహించాను అని తాజా ఇంటర్వ్యూలో కియరా తెలిపింది. తనని అనుసరించే వారి కోసం జాగ్రత్తగా ఉండాలన్న తన ఉద్ధేశం బాధ్యతను గుర్తు చేసుకుంది.
అభిమానుల తనని కొట్టేస్తాను అని వెంటపడేంత ప్రేమను పొందడాన్ని గొప్పగా ఫీలవుతానని కియరా అంది. ఎవరైనా గీత దాటితే.. అది చాలా భయానక అనుభవంగా మారుతోంది. నేను ప్రస్తుతం నా జీవితంలో ఏమి జరుగుతోంది ?! అన్నది ఆలోచిస్తున్నాను అని తెలిపింది. ఇక కియరా కెరీర్ పరిశీలిస్తే.. కరోనావైరస్ సంక్షోభాన్ని వదిలేస్తే... లక్ష్మీ బాంబ్- దోస్తానా 2- షేర్షా - ఇందూ కి జవానీ లాంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.