ఫోటో స్టొరీ: మిల్లీ లీటర్ కూడా గ్లామరసం లేదు!

Update: 2019-04-17 13:21 GMT
కియారా అద్వాని పేరును సినీ ప్రేమికులకు.. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పనే లేదు.  మహేష్ బాబు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం.. వెంటనే రామ్ చరణ్ సినిమాలో నటించడంతో టాలీవుడ్ లో భారీ గుర్తింపు సంపాదించింది.  ఇక హిందీలో అయితే క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తూ స్టార్ డమ్ దిశగా దూసుకుపోతోంది.  ఇక ఈ పాప లస్ట్ స్టోరీస్ సీరీస్.. వైబ్రేటర్ సీన్ సంచలనాలు అందరికీ తెలిసిందే కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్పుకుని పెద్దగా ఉపయోగం లేదు.

కియారా సోషల్ మీడియాలో చాలా చాలా యాక్టివ్ గా ఉంటుంది.  రెగ్యులర్ గా ఏదో ఒక ఫోటోనో.. వీడియోనో పోస్ట్ చేస్తూ లక్షల కొద్ది.. అప్పుడప్పుడూ మిలియన్ల కొద్దీ లైకులు తెచ్చుకుంటుంది.  కానీ దాదాపుగా ప్రతి ఒక్కటీ హాటుగా... వీలైనంత ఘాటుగా ఉండేలా జాగ్రత్త పడుతుంది.  కానీ తాజాగా కియారా పోస్ట్ చేసిన ఫోటోలో హాట్ నెస్ లేదు.. ఘాటు-నెస్ అంతకన్నా లేదు.  అసలు గ్లామరసం ఒక మిల్లిలీటర్ కూడా చిందించలేదు.  ఫుల్ గా కప్పుకుంది.  పింక్ కలర్ బ్లేజర్.. దానికి గట్టిగా బటన్లు పెట్టింది.  కొంచెం తల ఒంచుకొని  కళ్ళు మూసుకొని మొహం కనపడకూడదు అన్నట్టుగా .. తలనొప్పి పుడుతోంది అన్నట్టుగా చేతులను తన అందమైన మొహానికి అడ్డం పెట్టుకుంది.  ఈ హాట్ నెస్ లేని ఫోటోకు "ఏమీ  అడగొద్దు" అని క్యాప్షన్ ఇచ్చింది.  అయినా టన్నుల్లో హాట్నెస్ ఉండే సెక్సిణి ఇలా పరువాలను కనపడకుండా పూర్తిగా కవర్ చేసుకోవడమే ఒక పొరపాటు. పైగా 'ఏమీ అడగొద్దు' అని తిరిగి నెటిజనులను అంటే వాళ్ళు ఊరుకుంటారా?

ఒకరు "ఎందుకు డార్లింగ్.. ఏమైంది ?" అన్నారు. మరొకరు "మిస్ పింక్ ప్యాంథర్" అన్నారు. ఇంకో నెటిజనుడు "కియారా కొద్దిగా చేతులు తీస్తావా.. నీ అందమైన మొహం కనబడడం లేదు" అన్నాడు.  చిరాకు ప్రదర్శించిన ఓ నెటిజనుడు మాత్రం "ఏమీ చెప్పొద్దు" అంటూ సాఫ్ట్ గా కౌంటర్ ఇచ్చాడు. అయినా కియారా ఏమీ అడగొద్దని ఎందుకు క్యాప్షన్ ఇచ్చింది? అందుకు ఇలా హాట్ గా లేని ఫోటో పోస్ట్ చేసింది. ఎందుకు.. ఎందుకు.. ఎందుకు?


Tags:    

Similar News