బాలీవుడ్.. టాలీవుడ్.. వెబ్ సిరీస్ ఇలా పలు స్క్రీన్ లపై కనిపించిన కియారా అద్వానీ ప్రస్తుతం హిందీ సినిమా 'కబీర్ సింగ్' ప్రమోషన్ లో బిజీగా ఉంది. అర్జున్ రెడ్డి రీమేక్ అయిన కబీర్ సింగ్ ప్రమోషన్ లో భాగంగా ఆమె మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఫస్ట్ లవ్ గురించి చెప్పుకొచ్చింది. తాను 10వ తరగతిలోనే ప్రేమలో పడ్డానంది. తన మొదటి ప్రేమ విషయాలను కియారా వెళ్లడించి హాట్ టాపిక్ అయ్యింది.
కియారా మాట్లాడుతూ... నేను 10వ తరగతిలో ఉన్న సమయంలో ఒక అబ్బాయిని ప్రేమించాను. అతడిని నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను. కాని ఇంట్లో అమ్మ చదువుపై దృష్టి పెట్టమంటూ మందలించింది. ఈ వయసులో ప్రేమ ఏంటీ అంటూ అమ్మ కోప్పడటంతో నేను అతడితో బ్రేకప్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చింది. ఇప్పుడు ప్రేమించేందుకు సమయం లేదంది.
తెలుగులో 'భరత్ అనే నేను' చిత్రంతో పరిచయం అయిన కియారా అద్వానీ ఆ తర్వాత వినయ విధేయ రామ చిత్రంలో నటించింది. రెండవ సినిమా ఫ్లాప్ అవ్వడంతో టాలీవుడ్ లో ఈ అమ్మడికి పెద్దగా ఆఫర్లు రావడం లేదు. కాని బాలీవుడ్ లో మాత్రం ఈమె చాలా బిజీగా ఉంది. కబీర్ సింగ్ విడుదలకు సిద్దం అవ్వగా మరో రెండు మూడు హిందీ సినిమాల్లో కూడా ఈమె ఎంపిక అయ్యింది. కెరీర్ లో ఇంత బిజీగా ఉన్న కియారా అద్వానీ ప్రేమ గురించి ప్రస్తుతానికి ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చేసింది.