కన్నడ నటుడు సుదీప్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. `ఈగ` సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ కి దగ్గరైన నటుడు. అటుపై కొన్ని సిగ్నెచర్ చిత్రాల్లో సుదీప్ మార్క్ పెర్పార్మెన్స్ తో ఆకట్టకున్నారు. `బాహుబలి ది బిగినింగ్`..` సైరా నరసింహారెడ్డి` లాంటి సినిమాలు కిచ్చాని తెలుగు వాళ్లకి మరింత దగ్గర చేసాయి. అటుపై సుదీప్ నటించిన కొన్ని కన్నడ చిత్రాలు తెలుగులో అనవాదమయ్యాయి.
`పహిల్వాన్` లాంటి సినిమా తెలంగాణ ఆడియన్స్ కి బాగానే రీచ్ అయింది. తెలంగాణలో గల్లీకో పహిల్వాన్ ఉంటాడు. కుస్తీలు అనాదిగా వస్తోన్న ఆచారం నేపథ్యంలో నే అక్కడ సుదీప్ చిత్రాన్ని పెద్ద ఎత్తున రిలీజ్ చేసారు. తాజాగా సుదీప్ కథానాయకుడిగా అనూప్ బండారి తెరకెక్కించిన `విక్రాంత్ రోణా` పాన్ ఇండియా కేటగిరిలో రిలీజ్ అవుతోంది.
ఈ సినిమా ని దాదాపు 100 కోట్లు బడ్జెట్ తో నిర్మించారు. సన్నీలియోన్ నటించిన `వీరమ్ దేవి`.. `కేజీఎఫ్` తర్వాత కన్నడ పరిశ్రమ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రమిది. దీంతో విక్రాంత్ రోణాపై సుదీప్ చాలా ఆశలే పెట్టుకున్నాడు. దీనిలో భాగంగా తెలుగు మార్కెట్ పై దృష్టి సారించి పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి అతిధిగా విచ్చేసిన కింగ్ నాగార్జున సుదీప్ కి గురించి ఓ వాస్తవాన్ని బయట పెట్టారు.
``సుదీప్ ని అంతా కన్నడ వారు అనుకుంటారు. కానీ ఆయన మన తెలుగువాడే. హైదరాబాదీనే. కన్నడలో ఎక్కువగా సినిమాలు చేయడంతో అక్కడ నటుడనుకుంటారు. అది తప్పు. ఆయనకు తెలుగు ప్రేక్షకులు అంటే ఎంతో అభిమానం. సినిమా బాగుంటే తెలుగు ప్రేక్షలకు భాషతో సంబంధం లేదని ఎన్నోసార్లు రుజువు చేసారు.
అలాంటి సినిమాని మా ఆడియన్స్ నెత్తిన పెట్టుకుంటారు. `విక్రాంత్ రోణా` కూడా ఆ కోవలో నిలవాలని కోరుకుంటున్నా` అన్నారు. ఇటీవలి కాలంలో టాలీవుడ్ అన్ని భాషల సినిమాల్ని ఎంతగానో ప్రోత్సహిస్తుంది.
భాషతో సంబంధం లేకుండా సహాయం కోరిన ఏ నటుడి సినిమానైనా ప్రమోట్ చేయడానికి ముందుకొస్తున్నారు. చిరంజీవి..నాగార్జున..రాజమౌళి లాంటి వారు ఈ విషయంలో ఎంతో చొరవ తీసుకుని తెలుగు పరిశ్రమ ఔన్నత్యాన్ని జాతీయ స్థాయిలో చాటుతున్నారు.