వెర్సటైల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నుంచి.. ఆయన స్థాయికి తగిన సినిమా వచ్చి చాలా కాలమైంది. రకరకాల ప్రయోగాలు చేసి తన రేంజ్ ని తానే తగ్గించుకున్న వర్మ.. ఇప్పుడు మళ్లీ వీరప్పన్ ని పట్టుకుని ట్రాక్ లోకి వచ్చేశాడనే టాక్ వినిపిస్తోంది.
కిల్లింగ్ వీరప్పన్ చిత్రం తెలుగు వెర్షన్ కూడా జనవరి 1నే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ మన తెలుగు సెన్సార్ బోర్డ్ రిలీజ్ కి క్లియరెన్స్ ఇవ్వలేదు. కానీ ఈ మూవీ ఒరిజినల్ బేస్ కన్నడలో మాత్రం రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చేసుకుంటోంది. వర్మ మళ్లీ ఫాంలోకి వచ్చేశాడని, కన్నడ మీడియా కోడై కూస్తోంది. కర్నాటక మొత్తం ఇప్పటికే ఖతర్నాక్ టాక్ వచ్చేసింది. వీరప్పన్ స్టోరీని చూసేందుకు.. కన్నడ జనాలు తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. దాదాపుగా ప్రతీ థియేటర్ ముందు హౌజ్ ఫుల్ బోర్డ్ దర్శనమిస్తోందంటే.. వీరప్పన్ ని అడ్డం పెట్టుకుని వర్మ చేసిన హంగామా అర్ధమవుతుంది. ముఖ్యంగా సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ హ్యాట్రిక్ హిట్స్ తో ఊపు మీద ఉండడం.. ఇంతగా హిట్ అవడానికి బాగా కలిసొచ్చిన అంశంగా చెప్పుకోవాలి.
కన్నడ సూపర్ సూపర్ స్టార్ రాజ్ కుమార్ ని వీరప్పన్ కిడ్నాప్ చేసిన ఎపిసోడ్.. ఈ చిత్రానికే హైలైట్ అంటున్నారు. ఆ రాజ్ కుమార్ కొడుకు ఇప్పటి సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ చేసిన పోలీస్ పాత్ర చేయడం... కిల్లింగ్ వీరప్పన్ స్పెషల్ అట్రాక్షన్ గా చెప్పాలి. చాలా ఏళ్ల తర్వాత రామ్ గోపాల్ వర్మ నుంచి మంచి హిట్ రావడంతో.. వర్మ అభిమానుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. కన్నడ వెర్షన్ కి టాక్ సూపర్ గా ఉండడంతో.. ఇప్పుడు తెలుగు వెర్షన్ పైనా అంచనాలు పెరుగుతున్నాయి. ఈ నెల 7న తెలుగు కిల్లింగ్ వీరప్పన్ రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి.