అద్భుతంగా ఆడావు అంటున్న మాజీ గర్ల్ ఫ్రెండ్

Update: 2019-06-11 10:07 GMT
భారత క్రికెట్ లో అత్యుత్తమ ఆటగాళ్ళలో ఒకరిగా..  అంతర్జాతీయంగా బెస్ట్ ఫినిషర్స్ లో ఒకరిగా గుర్తింపు సాధించిన యువరాజ్ సింగ్ సోమవారం నాడు క్రికెట్ నుం రిటైర్ అవుతున్నట్టుగా ప్రకటించాడు. దీంతో అభిమానుల నుంచి.. యువరాజ్ కు వీడ్కోలు చెప్తూ అభినందన సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులే కాదు.. యువీతో క్రికెట్ ఆడిన ఇతర క్రికెటర్లు.. చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా యువీ సాధించిన ఘనతలు గుర్తు చేసుకుంటూ యువరాజ్ ను ప్రశంసిస్తున్నారు. ఇలా యువీ రిటైర్మెంట్ పై స్పందించిన భామల్లో బాలీవుడ్ నటి కిమ్ శర్మ కూడా ఉంది.

కిమ్ శర్మతో యువరాజ్ ప్రేమాయణం అప్పట్లో చాలా పాపులర్.  ఇద్దరూ పెళ్ళి వరకూ వెళ్తారని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి కానీ అలా జరగలేదు. ఇద్దరూ విడిపోయి ఎవరి దారి వారు చూసుకున్నారు.  యువీ ఆ తర్వాత ఎన్నో ప్రేమయణాలు సాగించి ఫైనల్ గా హేజల్  కీచ్ ను వివాహం చేసుకున్నాడు. మరివైపు కిమ్ శర్మ ఒక కెన్యా బిజినెస్ మ్యాన్ ను వివాహం చేసుకుంది.  తర్వత అభి ప్రాయభేదాల కారణంగా విడిపోయి సింగిల్ గా ఉంటోంది. అయితే కిమ్ శర్మ యువరాజ్ రిటైర్మెంట్ సందర్భంగా స్పందించి తనకు యువీ మంచి మిత్రుడేనని ఇండైరెక్ట్ సందేశాన్ని ఇచ్చింది. తన ట్విట్టర్ ఖాతా ద్వారా "వెల్ ప్లేయ్డ్ యువరాజ్ సింగ్.  క్రికెట్ లో ఎన్నో మరపురాని అద్భుత క్షణాలను అందించినందుకు నీ ఆటకు ఇదే మా స్టాండింగ్ ఒవేషన్.  హేజల్ కీచ్ తో మీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాను" అంటూ ట్వీట్ చేసింది.

యువరాజ్ కు ఇంకా చాలామంది స్పెషల్ విషెస్ తెలిపారు. అందులో మాజీ పాకిస్తానీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ ఒకరు.  అఖ్తర్ తన యూట్యూబ్ ఛానల్ ద్వరా యువిపై ప్రశంసలు కురిపిస్తూ యువరాజ్ ఒక అద్బుతమైన ఆటగాడని..యువికి ఉండే  ఫైటింగ్ స్పిరిట్ చాల తక్కువమంది దగ్గర ఉంటుందని అన్నాడు. ఒక ఒక ఓవర్లో ఆరు సిక్సుల గురించి కూడా ప్రస్తావించాడు. త్వరలో ఇద్దరు పిల్లలను కనమని కూడా సలహా ఇచ్చాడు. ఆడే సమయంలో బౌలర్లకు తినిపించేవాడివి .. భవిష్యత్తులో పిల్లలకు తినిపించు అంటూ చమత్కరించాడు.  

    

Tags:    

Similar News