టాలీవుడ్ హీరో కింగ్ నాగార్జున తదుపరి సినిమాల విషయంలో కాస్తా స్పీడ్ పెంచేసాడు. ఎన్నో ఆశలు పెట్టుకొని చేసిన మన్మధుడు-2 బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అవ్వడంతో.. ఇప్పుడు తదుపరి సినిమా కోసం భారీ గ్యాప్ తీసుకుని జాగ్రత్తపడుతున్నాడు. కొత్త డైరెక్టర్ సాల్మన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'వైల్డ్ డాగ్' సినిమాను ఎలాంటి ఆర్భాటం లేకుండా సైలెంట్ గా ఫినిష్ చేసాడు నాగార్జున. 2016లో 'సోగ్గాడే చిన్ని నాయన' సూపర్ హిట్ తర్వాత.. ఊపిరి సినిమా యావరేజ్ లిస్టులో చేరింది. అప్పటినుండి మొన్నటి దేవదాస్, మన్మధుడు-2 వరకు నాగ్ చేసిన సినిమాలన్నీ నిరాశపరిచాయి. ఇక వైల్డ్ డాగ్ తో ఓ ప్రయోగాత్మక సినిమాను ప్రేక్షకులకు అందించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను మ్యాటినీ ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డిలు నిర్మిస్తున్నారు.
అయితే సమాచారం ప్రకారం.. నాగార్జున వైల్డ్ డాగ్ మూవీ థియేటర్లలో విడుదల కాకుండా నేరుగా నెట్ ఫ్లిక్స్ ఓటిటిలో విడుదల కాబోతుందని సమాచారం. అంతే గాక ఈ చిత్ర హక్కులను నెట్‌ఫ్లిక్స్ 27 కోట్లకు కొనుగోలు చేసిందని అంటున్నారు. థియేటర్లు తెరిచిన తర్వాత కూడా నాగార్జున సినిమా ఓటిటిలో విడుదల అవుతుందని ఎవరు ఊహించలేదు. ”వైల్డ్ డాగ్” సినిమా నిజమైన సంఘటనల ఆధారంగా.. జాతీయ దర్యాప్తు సంస్థ అధికారి విజయ్ వర్మ పాత్ర లైఫ్ బేస్ చేసుకొని తెరకెక్కింది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దియా మీర్జా, సైయామి ఖేర్, అతుల్ కులకర్ణి, అలీ రెజా, అప్పాజీ, అంబరిషాలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్బంగా ఈ యాక్షన్ డ్రామా జనవరి 26న విడుదల కానుందని తెలుస్తుంది. మేకర్స్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.