స్టార్ హీరోల ల్యాండ్ మార్క్ చిత్రాల ముందు నెట్టింట జరిగే చర్చ గురించి చెప్పాల్సిన పనిలేదు. 25..50..75..100వ నెంబర్ చిత్రాల ముందు భారీ హైప్ క్రియేట్ అవుతుంది. 50వ సినిమాకే బోలెడంత హంగామా నెలకొంటుంది. ఇక మేజికల్ నెంబర్ 100కి చేరువయిదంటే ఆ నటుడు ఓ శిఖరం చేరుకున్నట్లే. అలాంటి అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నారు కింగ్ నాగార్జున.
చాలా సైలెంట్ గా సెంచరీకి చేరవవుతున్నారు. ఇప్పటివరకూ హీరో సహా..అన్ని రకాల పాత్రలు కలుపుకుని ఆయన చేసిన చిత్రాల సంఖ్య 98. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా 'ఘోస్ట్' తెరకెక్కుతోంది. ఇది కింగ్ 99వ చిత్రం. మరో సినిమా చేస్తే సెంచరీ పూర్తవుతుంది. అయితే ఈ సినిమా విషయంలో ఎలాంటి హైప్ క్రియేట్ అవ్వలేదు.
అక్కినేని కాంపౌండ్ సహా అభిమానులు సైలెంట్ గానే ఉన్నారు తప్ప ఎక్కడా హంగామా కనిపించలేదు. సాధారణంగా స్టార్ హీరో సెంచరీకి రీచ్ అయితే చాలా హడావుడి ఉంటుంది. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ మూవీ 150 సినిమా 'ఖైదీ నెంబర్ 150' కి ముందు ఎంత హంగామా చోటు చేసుకుందో తెలిసిందే. ఖైదీ అనుకున్నట్ల టైటిల్ కి పక్కన నెంబర్ 150ని హైప్ కోసమే తగిలించారు. దీంతో 150వ సినిమా ఎలా ఉంటుంది? ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు? ఇలా చాలా కొంత చర్చ సాగింది. ఆ నెంబర్ కోసం చిరంజీవి ఎంతో కసరత్తు చేసారు.
కోలీవుడ్ హిట్ మూవీని రీమేక్ గా తెరకెక్కించి ఆ నెంబర్ కి న్యాయం చేసారు. అదే సమయంలో నటసింహ బాలకృష్ణ 100వ సినిమా 'గౌతమీపుత్ర శాతకర్ణి'. బాలయ్య సెంచరీకి చేరువయ్యే సమయంలో నెట్టింట రేగిన దుమారం గురించి చెప్పాల్సిన పనిలేదు. బాలయ్య 97వ సినిమా నుంచి గురించి 100వ సినిమా ఏలా ? ఉంటుందని పెద్ద ఎత్తున చర్చ సాగింది.
అభిమానులు సహా ఇండస్ర్టీ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసింది. భారీ హైప్ క్రియేట్ చేయడంతోనే అది సాధ్యమైంది. అయితే కింగ్ మాత్రం తన సెంచరీ విషయంలో మౌనంగా ఉన్నారు. ఎలాంటి హంగామా చేయకుండా కామ్ గానే కానిచ్చేసేలా కనిపిస్తున్నారు. 'ఘోస్ట్' రిలీజ్ కి దగ్గర పడుతోన్న 100 వ సినిమా గురించి ఎక్కడా చర్చ సాగలేదు.
దీంతో కింగ్ మనసులో ఏముందో? అర్ధం కాని పరిస్థితి అక్కినేని అభిమానుల్లో మొదలైంది. మేజికల్ నెంబర్ ని ఎలాంటి కథతో ముగిస్తారు? 'మనం' తరహాలో ఫ్యామిలీ మొత్తాన్ని మళ్లీ ఏకం చేస్తారా? లేక సోలోగానే సెంచరీ కొడతరా? అన్న ఆసక్తి ఫ్యాన్స్ లో నెలకొంటుంది.