సీనియర్ హీరోలు మునుపెన్నడూ లేనంతగా స్పీడు పెంచేశారు. ఓ మూవీ రిలీజ్ కాగానే మరో రెండు మూడు చిత్రాలని బ్యాక్ టు బ్యాక్ సెట్స్ పైకి తీసుకొచ్చేస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి దాదాపు ఐదు చిత్రాలతో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. ఆయన తరహాలోనే విక్టరీ వెంకటేష్, నందమూరి బాలకృష్ణ కూడా బరిలోకి దిగిపోయారు. మల్టిపుల్ ప్రాజెక్ట్ లతో క్షణం తీరికలేకుండా గడిపేస్తున్నారు. వీరి తరహాలోనే కింగ్ నాగార్జున కూడా జోరు పెంచేశారు. ఓ పక్క బిగ్బాస్ ఓటీటీ లో హోస్ట్ గా వ్యవహరిస్తూనే మరో పక్క తన తాజా చిత్ర షూటింగ్ లో హుషారుగా పాల్గొంటూ షాకిస్తున్నారు.
కోవిడ్ సెకండ్ వేవ్ టైమ్ లోనూ బిగ్బాస్ సీజన్ షూటింగ్ లో పాల్గొంటూనే మరో పక్క 'వైల్డ్ డాగ్' షూటింగ్ ని చక చకా చేసేసి రిలీజ్ చేసేశారు. ఆ తరువాత 'బంగార్రాజు'ని పట్టాలెక్కించి ఊహించని విధంగా సంక్రాంతి బరిలో దించేసి షాకిచ్చారు. ఇప్పుడూ అదే పంథాని అనుసరిస్తూ జోరు చూపిస్తున్నారు. 'బంగార్రాజు' ఇటీవల సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత కింగ్ నాగార్జున యంగ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుతో కలిసి ఓ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్నారు.
'ది ఘోస్ట్' పేరుతో రూపొందుతున్న ఈ మూవీ ఇటీవలే షూటింగ్ మొదలైంది. ఓ పక్క డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ కోసం బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ వెర్షన్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున మరో పక్క 'ది ఘోస్ట్' మూవీ షూటింగ్ ని ఎక్కడా ఆపకుండా పరుగులుపెట్టిస్తున్నారు.
కరోనా థర్డ్ వేవ్ కారణంగా చాలా రోజులుగా షూటింగ్ పరమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న ఈ మూవీ తాజా షెడ్యూల్ ఎట్టకేలకే ప్రారంభమైంది. బుధవారం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ దుబాస్ లో మొదలైంది.
ఈ విషయాన్ని వెల్లడిస్తూ దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఆన్ లొకేషన్ కు సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. నాగార్జున, హీరోయిన్ సొనాల్ చౌహాన్ లు పాల్గొనగా బోట్ లో దర్శకుడు ప్రవీణ్ సత్తారు సన్నివేశాలని వివరిస్తున్నారు. అక్కడే పలు కీలక సన్నివేశాలని చిత్రీకరించిన అనంతరకం చిత్ర బృందం తిరిగి హైదరాబాద్ చేరుకోనుంది. విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీని ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్నారు.
డా. రాజశేఖర్ తో 'పీఎస్ వీ గరుడ వేగ' చిత్రాన్ని తెరకెక్కించి ఆయన కెరీర్ ని మలుపు తిప్పిన ప్రవీణ్ సత్తారు 'ది ఘోస్ట్' ని కూడా అదే పంథాలో కొత్త తరహా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారట. శరత్ మరార్, ఏషియన్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ని ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలిసింది.