మెగా హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే హడావిడి ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీలో ఎంతమంది హీరోలున్నా మెగా అభిమానులు వారందరి సినిమాలకు హంగామా చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఓ మెగా హీరో మూవీ రిలీజ్ అయింది. అయితే కనీసం ఆ సినిమా వచ్చినట్లు కూడా ఎవరికీ తెలియకపోవడం ఆశ్చర్యకరమైన విషయమే.
మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ 'విజేత' సినిమాతో హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. 'సూపర్ మచ్చి' సినిమాతో మరో ప్లాప్ అందుకున్న కళ్యాణ్.. ఇప్పుడు ''కిన్నెరసాని'' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 'అశ్వథ్థామ' ఫేమ్ రమణ తేజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాత రామ్ తళ్లూరి నిర్మించారు. అయితే ఈ సినిమా ఎలాంటి సందడి లేకుండా జీరో ప్రమోషన్స్ తో సైలెంట్ గా ఈరోజు (జూన్ 10) డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయింది.
నిజానికి 'కిన్నెర సాని' చిత్రాన్ని ముందుగా థియేటర్లో రిలీజ్ చేయాలనే మేకర్స్ భావించారు. కానీ కళ్యాణ్ దేవ్ గత చిత్రం 'సూపర్ మచ్చి' థియేటర్లో పెద్దగా ఆడకపోవడంతో.. థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయడానికి ప్రముఖ డిజిటల్ వేదిక 'జీ5' సంస్థతో అగ్రిమెంట్ చేసుకున్నారని తెలుస్తోంది.
ఎలాంటి సినిమా అయినా.. ఏ ప్లాట్ ఫార్మ్ లో రిలీజ్ చేస్తున్నా మినిమమ్ ప్రమోషన్స్ చేయడం అవసరం. అందులోనూ మెగా ఫ్యామిలీ హీరో సినిమా అంటే సోషల్ మీడియాలో సందడి కనిపిస్తుంది. కానీ ఆశ్చర్యకరంగా ''కిన్నెరసాని'' సినిమాని జీరో పబ్లిసిటీతో ఓటీటీలో విడుదల చేశారు. ఇటీవల కాలంలో జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే వెబ్ సిరీస్ లకు కూడా భారీగా ప్రచారం చేస్తున్నారు. కానీ మెగా అల్లుడి సినిమాని ప్రచారం లేకుండా సైలెంట్ గా రిలీజ్ చేయడం గమనార్హం. అందుకే ఈ సినిమా వచ్చిందని ఎవరికీ తెలియలేదు. దీనికి తగ్గట్టుగానే ఓటీటీ ఆడియన్స్ నుంచి ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వస్తోంది.
కథ విషయానికొస్తే.. ఎలాంటి కేసునైనా సునాయాసంగా పరిష్కరించే తెలివైన లాయర్ వెంకట్ (కల్యాణ్ దేవ్). కాలేజీ టైంలోనే ఓ అమ్మాయి(కాశిష్ ఖాన్)ని ప్రేమిస్తాడు. ఇద్దరూ పెళ్లి చేసుకుందామనుకునే సమయంలో ఆమె హత్యకు గురవుతుంది. అకారణంగా తన ప్రేయసిని చంపిన వారిపై పగ తీర్చుకోవాలనుకుంటాడు వెంకట్. ఈ క్రమంలో సీరియల్ కిల్లర్ జయదేవ్ (రవీంద్ర విజయ్) 'వేద' అనే పేరున్న అమ్మాయిలను చంపుకుంటూ పోతున్నాడనే విషయం తెలుస్తుంది. అతన్ని పట్టుకునే క్రమంలో అసలైన వేద (అన్ శీతల్) ను వెంకట్ కలుస్తాడు.
లైబ్రరీలో తనకు దొరికిన కిన్నెరసాని పుస్తకం తన జీవితమే అని తెలుసుకున్న వేద.. అందులో తండ్రి జయదేవ్ చిన్నప్పుడే తనను చంపాలనుకున్నాడనే విషయాన్ని తెలుసుకుంటుంది. తన ప్రియరాలిని చంపిన హంతకుడి కోసం వెంకట్.. తనను చంపాలనుకుంటున్న తండ్రి కోసం వేద వెతకడం మొదలుపెడతారు. అసలు జయదేవ్ ఎవరు? వేద అనే అమ్మాయిలను ఎందుకు చంపుతున్నాడు? అసలు వేదను తండ్రి ఎందుకు చంపాలనుకుంటాడు? అనే విషయాలు తెలియాలంటే ''కిన్నెరసాని'' సినిమా చూడాల్సిందే!
'కిన్నెరసాని' సినిమా ఒక మర్డర్ సీన్ తో మొదలై.. మర్డర్ సన్నివేశంతోనే ముగుస్తుంది. ఫస్టాఫ్ ను సస్పెన్స్ ట్విస్టులతో నడిపించగా.. సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ తో థ్రిల్ కు గురి చేయాలని చూసారు. సాయి తేజ దేశరాజు అందించిన కథ కథనం మాటలు సరికొత్తగా ఉన్నాయి. అయితే దర్శకుడు దీన్ని ఓన్ చేసుకోలేకపోయాడెమో అనిపిస్తుంది. క్లైమాక్స్ మీద కొంచెం దృష్టి పెట్టుంటే బాగుండేది.
కళ్యాణ్ దేవ్ ఇంతకముందు సినిమాలకు కంటే నటనపరంగా పర్వాలేదనిపించాడు. అన్బరివ్ ఫైట్స్ సహజంగా అనిపిస్తాయి. దినేశ్ కె బాబు సినిమాటోగ్రఫీ.. మహతి స్వర సాగర్ నేపథ్య సంగీతం ఆకట్టుకున్నాయి. ఓటీటీ సినిమా కాబట్టి మర్డర్ మిస్టరీలను ఇష్టపడేవారు ''కిన్నెరసాని'' సినిమాను ఒకసారి చూసేయ్యొచ్చు.