భర్తతో విడిపోతున్నట్లుగా ప్రకటించిన హీరోయిన్‌

Update: 2021-04-02 08:05 GMT
బాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ మూవీ 'పింక్‌' లో ఒక హీరోయిన్‌ గా నటించిన కృతి కుల్హారి తన భర్త సాహిల్‌ సెహగల్‌ తో విడిపోబోతున్నట్లుగా ప్రకటించింది. అయిదు సంవత్సరాల వైవాహిక జీవితంకు ఫుల్‌ స్టాప్‌ పెడుతున్నందుకు కాస్త ఇబ్బందిగా ఉంది. కాని జీవితంలో కొన్ని సంఘటనలు ఇబ్బంది అయినా కూడా తప్పనిసరి పరిస్తితుల్లో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. నేను నా భర్త విడిపోవాలనుకున్నాం. ఇప్పటికే నిర్ణయం తీసుకున్న తర్వాత అందరికి తెలియజేస్తున్నాను. కోర్టు ద్వారా మేము విడాకులు తీసుకోవాలని భావించడం లేదు. ఒకరికి ఒకరు దూరంగా ఉండిపోతున్నాం.

ఐదేళ్లు కలిసి ఉండి విడిపోవాలంటే కాస్త కష్టమైన విషయమే. మేము తీసుకున్న నిర్ణయం కొందరికి తప్పుగా అనిపించవచ్చు. కాని పరిస్థితుల ప్రభావం వల్ల విడిపోవాలనే నిర్ణయానికి వచ్చేశాం అంది. ఈ నిర్ణయాన్ని మళ్లీ పరిశీలించుకునే అవకాశం లేదని తాము మళ్లీ జీవితంలో కలిసే అవకాశం లేదన్నట్లుగా కృతి కుల్హారి చెప్పుకొచ్చింది. జీవితంలో కొన్ని ఎత్తు పల్లాలు కామన్‌ గా వస్తూ ఉంటాయి. వాటిని అధిగమించి నేను ముందుకు సాగాలనుకుంటున్నాను అంది. నటిగా బిజీగా ఉన్న సమయంలో సాహిల్‌ ను పెళ్లి చేసుకున్న కృతి కొంత కాలం వరకు బాగానే ఉన్నా ఇద్దరి మద్య విభేదాల కారణంగా విడిపోయినట్లుగా తెలుస్తోంది.
Tags:    

Similar News