చిత్రం : ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’
నటీనటులు: రాజ్ తరుణ్ - అను ఇమ్మాన్యుయెల్ - అర్బాజ్ ఖాన్ - ప్రవీణ్ - సుదర్శన్ - పృథ్వీ - రఘుబాబు - ప్రభాకర్ - నాగబాబు తదితరులు
సంగీతం: అనూప్ రూబెన్స్
ఛాయాగ్రహణం: రాజశేఖర్
మాటలు: సాయిమాధవ్ బుర్రా
కథ: శ్రీనివాస్ విస్సా
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
స్క్రీన్ ప్లే - దర్శకత్వం: వంశీకృష్ణ
చిన్న సినిమాలతో మంచి విజయాలందుకుంటూ సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్నాడు రాజ్ తరుణ్. ఇప్పుడతను కొంచెం పెద్ద స్థాయి సినిమా చేశాడు. ‘దొంగాట’ ఫేమ్ వంశీకృష్ణ దర్శకత్వంలో ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’లో నటించాడు. దీని టీజర్.. ట్రైలర్ జనాల్లో ఆసక్తి రేకెత్తించాయి. మరి సినిమా కూడా అంతే ఆసక్తికరంగా ఉందా? చూద్దాం పదండి.
కథ:
కిట్టు (రాజ్ తరుణ్) అనాథ కుర్రాడు. తన లాంటి ఇంకో ముగ్గురబ్బాయిలతో కలిసి అనాథాశ్రమంలో పెరుగుతాడు. మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి గ్యారేజ్ నడుపుకుంటున్న కిట్టు.. తన గ్యారేజీకి కారు రిపేరుకిచ్చిన జాను (అను ఇమ్మాన్యుయెల్)తో ప్రేమలో పడతాడు. ఐతే ఆ అమ్మాయి వల్ల కిట్టు ఆర్థిక ఇబ్బందుల్లో పడతాడు. ఆ ఇబ్బందుల నుంచి బయటపడటానికి తన స్నేహితులతో కలిసి ఒక ప్లాన్ వేస్తాడు కిట్టు. ఖరీదైన కుక్కల్ని కిడ్నాప్ చేసి.. డబ్బులు డిమాండ్ చేయడం పనిగా పెట్టుకుంటుంది ఈ గ్యాంగ్. ఐతే దీని గురించి తెలిసి జాను కిట్టును అసహ్యించుకుంటుంది. అంతలోనే ఆమె కిడ్నాప్ అవుతుంది. ఇంతకీ అసలు కిట్టు ఎందుకు ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడు.. అనును కిడ్నాప్ చేసిందెవరు.. జానును కిట్టు ఎలా కాపాడుకున్నాడు.. అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ మల్టిబుల్ లేయర్లు కాంప్లెక్స్ స్టోరీ. కామెడీ ప్రధానంగా సాగే ఈ కిడ్నాప్ డ్రామాలో చాలా మలుపులున్నాయి. ఆ మలుపులన్నీ ఆసక్తి రేకెత్తించేవే. ఐతే ఈ కథను.. ఈ మలుపుల్ని ఆసక్తికరంగా తెరమీదికి తేవడంలో వంశీకృష్ణ బృందంఅనుకున్నంతగా సక్సెస్ కాలేదు. ప్రతి సన్నివేశంలోనూ వినోదం పంచడమే లక్ష్యంగా సాగే ఈ సినిమాలో కామెడీ కొంత వరకు పేలింది కానీ.. కథను పద్ధతిగా చెప్పలేకపోయారు. చాలా ఎక్కువ విషయాలు చెప్పాలనే ప్రయత్నంలో ఈ కథ కంగాళీగా తయారైంది. హీరో బ్యాచ్.. మాఫియా బ్యాచ్.. రౌడీ బ్యాచ్.. పోలీస్ బ్యాచ్.. ఇలా సినిమాలో బోలెడన్ని బ్యాచులున్నాయి. అందరూ కలిసి కథను గందరగోళం చేశారు. ఇందులో కథే చాలా కాంప్లెక్స్ గా అనిపిస్తుంది. పైగా ఎక్కడా లాజిక్కుల గురించి పట్టించుకోలేదు. మనం కూడా లాజిక్కుల గురించి మరిచిపోయి.. కామెడీని మాత్రమే తీసుకుంటే కొంత వరకు టైంపాస్ అవుతుంది.
మనీ తరహా క్రైమ్ కామెడీల స్ఫూర్తితో అల్లుకున్న కథ ఇది. ఆ కోవలో వచ్చిన భిన్నమైన కథల్లో ఇది పాతగా అనిపిస్తుంది. సినిమా ఎలా మొదలై.. ఎలా ప్రయాణం చేసి.. ఎలా ముగిసిందో అవలోకనం చేసుకుంటే ఇందులో ఎన్నెన్నో మలుపులు కనిపిస్తాయి. ఇన్ని ట్విస్టుల్ని గుదిగుచ్చి.. కన్విన్సింగ్ గా కథను చెప్పడం అంత సులువు కాదు. ఈ విషయంలో కిట్టు ఉన్నాడు జాగ్రత్త టీం సగమే విజయవంతమైంది. ప్రథమార్ధం వరకు ట్విస్టులు.. కామెడీ అలరిస్తాయి. కానీ ద్వితీయార్ధంలో కథ కంగాళీగా తయారవడంతో సినిమా ట్రాక్ తప్పుతుంది.
హీరో కుక్కల కిడ్నాపర్ కావడమే ఆసక్తి రేకెత్తించే అంశం. ఈ కుక్కల కిడ్నాప్ తో ముడిపడ్డ సన్నివేశాలన్నీ బాగానే వచ్చాయి. హీరో-హీరోల మధ్య ప్రేమకథ కూడా పర్వాలేదనిపిస్తుంది. స్నిగ్ధ పాత్రతో వేయించిన పంచులు పర్వాలేదనిపిస్తుంది. ఇక రేచీకటి ఉన్న రౌడీగా పృథ్వీ తనదైన శైలిలో నవ్వించడంతో ప్రథమార్ధం వేగంగా సాగిపోతుంది. ఇంటర్వెల్ ముందు ట్విస్టు ఆసక్తి రేకెత్తిస్తుంది. ఐతే ప్రథమార్ధం వరకు ఓకే ఫీలింగ్ కలిగించే కిట్టు ఉన్నాడు జాగ్రత్త ద్వితీయార్ధంలో ట్రాక్ తప్పుతుంది. రఘబాబు ఎపిసోడ్.. ఐటెం సాంగ్.. రాజా రవీంద్ర పాత్రతో ముడిపడ్డ సన్నివేశాలు అనాసక్తికరంగా.. అనవసరంగా అనిపించడంతో కథ సజావుగా నడవదు. వినోదం పాళ్లు కూడా తగ్గాయి.
ఒక డెన్.. అందులో మూణ్నాలుగు గ్యాంగులు ఒకచోటికి చేరి.. ఒకరినొకరు కాల్చుకుంటూ దాగుడు మూతలు ఆడే పతాక సన్నివేశం చాలా సినిమాల్లో చూసి ఉంటాం. ఇందులోనూ అదే కనిపిస్తుంది. అదేమంత ఆసక్తి రేకెత్తించకపోయినా.. పృథ్వీ కామెడీ మాత్రం క్లైమాక్స్ కు ఆకర్షణగా నిలుస్తుంది. సినిమాకు పృథ్వీ కామెడీ ప్లస్. కామెడీ ఓకే అనిపించినా జానర్ కు ఉన్న పరిమితుల దృష్ట్యా ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ అన్ని వర్గాల ప్రేక్షకులకూ చేరుతుందా అన్నది కొంచెం సందేహం. ఫ్యామిలీ ఆడియన్స్ కు ఇది అంతగా రుచించకపోవచ్చు. యూత్ కనెక్టయ్యే అవకాశముంది. కథలో చాలా మలుపులున్నప్పటికీ నరేషన్ కొంచెం నెమ్మదిగా అనిపిస్తుంది. అది ప్రతికూలతే. లాజిక్స్ గురించి పట్టించుకుంటే మొదట్లోనే స్ట్రక్ అయిపోతాం. వాటి సంగతి వదిలేసి వినోదాన్ని తీసుకోవాలి.
నటీనటులు:
‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’లో యాక్టర్స్ అందరూ ఓకే. రాజ్ తరుణ్ ఈజ్ కిట్టు పాత్రకు బాగా కలిసొచ్చింది. అను ఇమ్మాన్యుయెల్ టిపికల్ బ్యూటీ. కొన్ని యాంగిల్స్ లో బాగా అనిపిస్తుంది. కొన్నిసార్లు ఏదోలా ఉంటుంది. తొలి సినిమాతో పోలిస్తే ఇందులో చాలా సెక్సీగా కనిపించింది అను. హీరో స్నేహితులుగా ప్రవీణ్.. సుదర్శన్ నవ్వించారు. పృథ్వీ చాన్నాళ్ల తర్వాత భలేగా ఎంటర్టైన్ చేశాడు. అతడి కెరీర్లో ‘రేచి’ క్యారెక్టర్ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. విలన్ అర్బాజ్ ఖాన్ ఓకే. ప్రభాకర్.. నాగబాబు.. రఘుబాబు.. వీళ్లందరూ పాత్రలకు తగ్గట్లుగా నటించారు. రాజా రవీంద్ర, సామ్రాట్ పాత్రలు మామూలే.
సాంకేతికవర్గం:
ఏమంత బాగా లేవు. నేపథ్య సంగీతం పర్వాలేదు. ఛాయాగ్రహణం ఓకే.. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. రాజ్ తరుణ్ మార్కెట్ స్థాయికి మించే ఖర్చు పెట్టారు. ఇందులోని కాస్టింగ్ చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. రాజ్ తరుణ్ సినిమాకు ఇంతమంది భారీ తారాగణాన్ని పెట్టుకోవడం.. సినిమాను రాజీ లేకుండా నిర్మించడం విశేషమే. మాటల రచయిత సాయిమాధవ్ బుర్రామార్కు డైలాగులు ఇందులో లేవు. కొన్ని కామెడీ పంచులు పేలాయి. శ్రీనివాస్ విస్సా కథలో కొన్ని సినిమాల స్ఫూర్తి కనిపిస్తుంది కానీ.. అతను అనేక మలుపులతో కథను తీర్చిదిద్దాడు. ఈ కథను వంశీకృష్ణ అనుకున్నంత సమర్థంగా తెరమీదికి తేలేకపోయాడు.ద్వితీయార్ధంలో కథను కంగాళీగా తయారు చేశాడు. క్రైమ్ కామెడీ జానర్ మీద అతడికున్న పట్టు మాత్రం అక్కడక్కడా కనిపిస్తుంది. కామెడీని అతను బాగా డీల్ చేశాడు.
చివరగా: కిట్టుగాడు.. జస్ట్ ఓకే
రేటింగ్-2.5/5
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre