టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల్లో ఒకరైన దామోదర్ ప్రసాద్ ను గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు. డబ్బుల విషయమై తమ దగ్గరికి వచ్చి సెటిల్ చేసుకోవాలని.. లేదంటే చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ని బెదిరించారట. ఈ విషయమై ఆయన బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దామోదర్ ప్రసాద్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని జర్నలిస్ట్ కాలనీలో ఉంటారు. శనివారం మధ్యాహ్నం ఆయనకు గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ముందు ఆయన పనిలో ఉండి ఫోన్ తీయలేదు. తర్వాత మళ్లీ మళ్లీ ఆ నంబర్ నుంచి కాల్స్ వచ్చాయి. ఫోన్ తీయగానే అవతలి వ్యక్తి తీవ్ర స్వరంతో తిడుతూ మాట్లాడాడట.
ఎవరని అడిగినా చెప్పకుండా తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ తనకు డబ్బులు ఇవ్వాల్సి ఉందని.. ఆయనకు మిత్రుడు కాబట్టి మీరొచ్చి డబ్బులు సెటిల్ చేయాలని.. లేదంటే చంపేస్తామని అవతలి వ్యక్తి బెదిరించినట్లు దామోదర్ ప్రసాద్ వివరించారు. ప్రతాని రామకృష్ణ గౌడ్ తనకు తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా మాత్రమే పరిచయమని.. ఆయనతో తనకు ఎలాంటి వ్యాపార లావాదేవీలు.. ఇతర సంబంధాలు లేవని ఆయన తెలిపారు. తనను బెదిరించిన వారిని పట్టుకుని శిక్షించాలని ఆయన కోరారు. బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ నంబర్ ఆధారంగా అవతలి వ్యక్తి ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ‘అలా మొదలైంది’.. ‘కళ్యాణ వైభోగమే’ లాంటి సినిమాలతో దామోదర్ ప్రసాద్ పాపులారిటీ సంపాదించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/