టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ - ఓపెనర్ శిఖర్ ధావన్ మంచి మిత్రులు. వీరు మైదానంలో ఆడుతుంటే వారి భార్యలు అనుష్కశర్మ-అయేషా ముఖర్జీ గ్యాలరీలో సందడి చేస్తుంటారు. విరాట్ - శిఖర్ కంటే కూడా వీరిద్దరూ బాగా క్లోజ్ అని అంటుంటారు. షాపింగ్ - బయటకు ఎక్కడికి వెళ్లినా వీరిద్దరు కలిసే వెళ్తారట.. కానీ తాజా పరిణామంతో అనుష్క - అయేషా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి తయారైందని.. వారిద్దరి మధ్య మాటలు బంద్ అయ్యాయని.. ఎడమొహం - పెడమొహంగా ఉంటున్నారని.. అనుష్కశర్మపై అయేషా పీకలదాకా కోపం పెంచుకుందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీనిపై ప్రముఖ హిందీ పత్రిక దైనిక్ జాగరణ్ ఓ సంచలన కథనం కూడా ప్రచురించింది.
అయితే అయేష శర్మ కోపానికి కారణం.. తన భర్త శిఖర్ దావన్ ను తాజాగా వెస్టిండీస్ తో జరిగే టెస్ట్ సిరీస్ నుంచి తప్పించడమేనట.. శిఖర్ ను తప్పించడం వెనుక అనుష్క శర్మనే కారణమని అయేషా ఫైర్ అయ్యిందని.. ఇక జట్టుతో ఉన్నప్పుడు కూడా విరాట్ తోపాటు ఆమె అంతర్గత సమావేశాలకు వెళ్తుందని అయేషా సీరియస్ అయినట్టు దైనిక్ పత్రికలో కథనం వివరించింది.
అయితే అనుష్కతో తనకు గొడవలపై అయేషా వివరణ ఇచ్చింది. ఇవన్నీ గాలివార్తలేనని కొట్టిపారేసింది. తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని స్పష్టం చేసింది. బీసీసీఐ అధికారులు సైతం విరాట్ - శిఖర్ భార్యల మధ్య ఎలాంటి గొడవ జరగలేదని వివరణ ఇచ్చారు.