మొదటి నుంచి కూడా తెలుగులో తమిళ అనువాదాలు ప్రభావం కొనసాగుతూనే వస్తోంది. తమిళ హీరోలంతా తమిళంల్తో పాటు తమ సినిమాలు తెలుగులోను విడుదలయ్యేలా చూసుకుంటూ వస్తున్నారు. రజనీకాంత్ నుంచి శివకార్తికేయన్ వరకూ అంతా కూడా తెలుగులో తమ సినిమాలు భారీ స్థాయిలో విడుదలయ్యేలా చూసుకుంటున్నారు. తాజాగా విష్ణు విశాల్ కూడా తన 'FIR' సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నాడు. మను ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 11వ తేదీన విడుదల కానుంది. తెలుగులో రవితేజ సమర్పిస్తున్న ఈ సినిమా, నిన్న రాత్రి ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను జరుపుకుంది.
విష్ణు విశాల్ తో సాన్నిహిత్యం ఉన్న సిద్ధు జొన్నల గడ్డ .. సందీప్ కిషన్ ఈ కార్యక్రమానికి వచ్చారు. ఈ వేదికపై విష్ణు విశాల్ మాట్లాడుతూ .. " ఇక నేను తెలుగుపై కూడా దృష్టి పెడతాను. త్వరలో తెలుగు నేర్చుకుంటాను .. స్ట్రైట్ తెలుగు సినిమా చేస్తాను. ఈ సినిమాను తెలుగులో విడుదల చేయడానికి కారకురాలు గుత్తా జ్వాలనే అని చెప్పుకొచ్చాడు. ఈ సినిమాకి ఇక్కడ కూడా మంచి ఆదరణ లభిస్తుందనే నమ్మకం ఉందని అన్నాడు. మను ఆనంద్ దర్శక ప్రతిభకు ఈ సినిమా నిదర్శనంగా నిలుస్తుందని చెప్పుకొచ్చాడు. తనని సపోర్ట్ చేయడానికి వచ్చిన సందీప్ కిషన్ కి థ్యాంక్స్ చెప్పాడు.
ఈ వేదికపై సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ .. " విష్ణు విశాల్ ఈ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమవుతున్నందుకు ముందుగా వెల్ కమ్ చెబుతున్నాను. ఈ కథ నాకు ఎంతో ఇష్టమైన యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో నడుస్తుంది. అలాంటి జోనర్లో విష్ణు విశాల్ పరిచయమవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా ట్రైలర్ ను నేను చూశాను .. చాలా ఫెంటాస్టిక్ గా అనిపించింది. ముఖ్యమైన పాత్రల్లో మంజిమా మోహన్ .. గౌతమ్ సార్ .. రెబా చాలా బాగా కుదిరారని అనిపించింది. ఈ సినిమా ఈ నెల 11వ తేదీన ఈ సినిమా థియేటర్లకు వస్తుంది .. తప్పకుండా చూడండి.
అలాగే రవితేజ గారి 'ఖిలాడి' సినిమా కూడా అదే రోజున వస్తోంది. ఈ వేదిక ద్వారా ఆయనకి కూడా ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. ఆ రోజున వస్తున్న మిగతా సినిమాలు కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నాను" అని చెప్పుకొచ్చారు. ఇక సిద్ధు జొన్నలగడ్డ విషయానికి వస్తే, ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'డీజే టిల్లు' కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందింది. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వచ్చిన అప్ డేట్స్ యూత్ లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమాతో తప్పకుండా హిట్ కొడతాననే నమ్మకంతో ఆయన ఉన్నాడు.