ప‌వ‌న్ పై `విద్వేషం` అని మార్చి రాశారు!

Update: 2021-09-12 06:31 GMT
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో స్టార్ రైట‌ర్ కోన సాన్నిహిత్యం గురించి తెలిసిన‌దే. ప‌వ‌న్ టాపిక్ తెస్తే చాలు.. స్టార్ రైట‌ర్  కోన వెంక‌ట్ ఒక‌ప్పుడు ప్ర‌శంస‌ల ఝ‌డివాన‌లో ముంచేసేవారు. ప‌వ‌న్  వ్య‌క్తిత్వంలో గొప్ప‌ద‌నంపై త‌న‌దైన శైలిలో వ‌ర్ణ‌న‌లు చేసేవారు. ప‌వ‌న్ అభిమానుల్లో ప‌వ‌నిజం గురించి ఆ రేంజ్ లో చెప్పేవారు. ఇక ప‌వ‌న్ తో త‌న‌కున్న వ్య‌క్తిగ‌త ప‌రిచయం.. ఇద్ద‌రి స్నేహం గురించి  కూడా చెప్పిన సంద‌ర్భాలున్నాయి. ప‌వ‌న్ తో చాలా క్లోజ్ గా మూవ్ అవుతాన‌ని.. అత‌నితో అంత చ‌నువు ఎంతో కాలంగా ఉంద‌ని చెప్పారాయ‌న‌. అయితే స‌రిగ్గా ఎన్నిక‌ల స‌మ‌యంలో  కోన వైకాపా తీర్ధం పుచ్చుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మ‌ద్ద‌తిస్తూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు.

ప‌నిలో ప‌నిగా ప‌వ‌న్ పైనా కొన్ని ఆరోప‌ణ‌లు చేసారు.  అయితే ఆయ‌న‌ ఉన్న‌ప‌ళంగా స్టాండ్ మార్చ‌డంపై విమ‌ర్శ‌లొచ్చాయి. ఓ ఇంట‌ర్వ్యూలో భాగంగా కోన అలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం ప‌వ‌న్ అభిమానులు తీవ్ర కోపానికి గుర‌య్యారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా కోన‌పై ప‌వ‌న్  అభిమానులు ఓ రేంజ్ లోనే దాడి చేసారు.  అలా కోన‌-ప‌వ‌న్ ఫ్యాన్స్  మ‌ధ్య వివాదం మొద‌లైంది. అయితే తాజాగా కోన వాళ్ల‌తో ఇప్పుడు వివాద ప‌రిష్కారం కోసం ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ప‌వ‌న్ కి- త‌న‌కి మ‌ధ్య గ్యాప్ రావ‌డానికి కార‌ణం మీడియా అని  తాను  ఇంట‌ర్వ్యూలో ఒక‌టంటే మ‌రొక‌టి రాసార‌ని  అన్నారు.

`అమాయ‌క‌త్వం` అనే ప‌దాన్ని తాను వాడితే `విద్వేషం` అని  రాసారని కోన ఆల‌స్యంగా వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసారు. ఆ త‌ర్వాత దీనిపై ఆ ఇంట‌ర్వ్యూయ‌ర్ కి ఫోన్ చేసి ప్ర‌శ్నించిన‌ట్లు కోన తెలిపారు. మ‌రి కోన తాజా వ్యాఖ్య‌ల ను ప‌వ‌న్ ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు? అన్న‌ది ప‌క్క‌న‌బెడితే  వివ‌ర‌ణ అనేది ఇప్పుడు కాదు...ఆ త‌ప్పిదం జ‌రిగిన వెంట‌నే ఇస్తే బాగుండేద‌ని అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఇప్పుడు ఇలాంటి వివ‌ర‌ణాలు ఇస్తే  మ‌ళ్లీ మ‌రో కొత్త ర‌క‌మైన స్టాండ్ తీసుకున్న‌ట్లు అవుతుంద‌ని అంటున్నారు. 
Tags:    

Similar News