శంకరాభరణం.. తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేని క్లాసిక్. అలాంటి పేరు పెట్టుకుని ఓ క్రైమ్ కామెడీ తీస్తానని కోన వెంకట్ ప్రకటించిన రోజే జనాలకు అదోలా అనిపించింది. సోషల్ మీడియాలో జనాలు సెటైర్లు కూడా వేశారు. కానీ అవేమీ పట్టించుకోకుండా ‘శంకరాభరణం’ తీసేశాడు కోన. సినిమాకు మాంచి హైప్ రావడంతో నెమ్మదిగా జనాల్లో ఉన్న నెగెటివ్ ఫీలింగ్ పోయింది కానీ.. విడుదల తర్వాత మాత్రం ‘శంకరాభరణం’ టైటిల్ వాడుకోవడంపై జనాలు కోనను తిట్టిపోస్తున్నారు. అసలు సినిమాకు ఈ టైటిల్ పెట్టాల్సిన అవసరమే లేదని.. ఇది కేవలం పబ్లిసిటీ జిమ్మిక్ అని తిడుతున్నారు జనాలు.
ఈ దెబ్బతో కోన వెంకట్ కు ఎక్కిన కిక్కంతా దిగిపోయి ఉంటుందనుకున్నారు జనాలు. కానీ కోనకు మాత్రం అలాంటి ఫీలింగేమీ ఉన్నట్లు లేదు. ‘శంకరాభరణం’ టైటిల్ తో ఓ ఆటాడుకున్న కోన.. ఇప్పుడు ఇంకో ఓల్డ్ క్లాసిక్ మీద పడబోతున్నాడట. ‘పాతాళ బైరవి’ పేరుతో ఓ సినిమా తీయడానికి కోన సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఐతే టైటిల్ మినహాయిస్తే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏ వివరాలు తెలియట్లేదు. ఐతే ఈ పేరుతో తానో సినిమా తీయబోతున్నట్లు మాత్రం సన్నిహితుల దగ్గర వెల్లడించాడు కోన. బహుశా ‘శంకరాభరణం’ విషయంలో వచ్చిన విమర్శల్ని దృష్టిలో ఉంచుకుని కసితో ఈ పాతాళ భైరవి పేరెత్తుతున్నట్లుంది. ఈసారి ఓల్డ్ క్లాసిక్ పేరు వాడుకుని హిట్టు కొట్టి అందరికీ తనేంటో చూపించాలని పట్టుదలతో ఉన్నట్లున్నాడు కోన.