అక్కినేని నాగ చైతన్య నటించిన రెండు సినిమాలు ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన సాహసం శ్వాసగా సాగిపో ఒకటి కాగా.. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన మలయాళీ రీమేక్ ప్రేమమ్ మరొకటి. ఇప్పుడీ రెండు సినిమాలు రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాయి. ప్రేమమ్ టీమ్ నార్వేలో ఓ పాట షూటింగ్ లో ఉండగా.. తిరిగొచ్చాక రిలీజ్ డేట్ పై అనౌన్స్ చేయనున్నారని అంటున్నారు.
ఇక సాహసం శ్వాసగా సాగిపో సంగతి అయితే తేలడం లేదు. చాలా నెలలుగా ఈ మూవీ పెండింగ్ లో ఉండిపోయింది. జూన్ లో ఆడియో రిలీజ్ కూడా చేసేయడంతో.. ఇక రిలీజ్ డేట్ ఫైనల్ అనుకున్నారు. ఇది ద్విభాషా చిత్రం కావడంతో తమిళ్ - తెలుగు వెర్షన్లను ఒకేసారి రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ సూపర్ స్టార్ రజినీ మూవీ కబాలి ఎఫెక్ట్ తో.. పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు కబాలిపై క్లారిటీ వచ్చినా సాహసానికి మాత్రం డేట్ ఫిక్స్ కావడం లేదు. దీనిపై చర్చించేందుకు రీసెంట్ గా చెన్నై కూడా వెళ్లాడు తెలుగు వెర్షన్ నిర్మాత కోన వెంకట్.
'గౌతమ్ మీనన్ తో కలిసి చర్చించి సాహసం శ్వాసగా సాగిపో రిలీజ్ డేట్ లాక్ చేసేందుకు చెన్నై వచ్చాను. త్వరలో ఆయన విడుదల తేదీ అనౌన్స్ చేస్తారు' అంటూ కోన వెంకట్ రెండు రోజుల క్రితమే ట్వీట్ పెట్టినా ఇప్పటివరకూ మళ్లీ ఎలాంటి ప్రకటనా రాలేదు. వరుసగా సినిమాలు క్యూ కట్టేసిన ఈ టైమ్ లో.. మరి చైతు ఏ డేట్ ని సెలక్ట్ చేసుకుంటాడో!