బ్రూస్ లీ ఆడియో ఫంక్షన్ లో రైటర్ కోన వెంకట్ కామెంట్స్ హాట్ టాపిక్ గా నిలిచాయి. వైట్లతో విబేధాలున్న సమయంలో ఈ సినిమాను ఎందుకు చేశారని చాలామంది అడిగారట కోనని. అయితే.. దీనికి ఆయనిచ్చిన సమాధానం ఏంటో తెలుసా.. వుయ్ లవ్ చరణ్.. అండ్ వుయ్ హేట్ వైట్ల. అందుకే ఈ మూవీ చేశానంటూ షాక్ ఇచ్చాడు కోన వెంకట్.
తమ స్టోరీకి వేరే ఇతర ఆప్షన్ వెతుక్కోలేనంత ట్యాలెంటెడ్ డైరెక్టర్ శ్రీను వైట్ల అంటూ.. తాను ఎందుకు ద్వేషిస్తున్నాడో వివరించాడు కోన. తమ సయోధ్యకు కారణం రామ్ చరణ్ వ్యక్తిత్వమే అని కుండబద్దలు కొట్టేశాడు కోనవెంకట్. అదే టైంలో ఇండస్ట్రీలో కొందరికి చురకలు వేశాడాయన. ఇద్దరు కొట్టుకుంటూంటే చాలా మంది చూస్తూ ఉండిపోతారని, అవసరమైతే ఇంకా ఎగదోస్తారని అన్నాడు కోన.
చరణ్ గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాడిని, వయసులో చిన్నవాడైనా.. వైట్లకు, తనకు సయోధ్య కుదిర్చాడని చెప్పాడు కోన వెంకట్. మనుషుల మధ్య విబేధాలు వస్తాయి... కానీ సినిమా అంతకంటే గొప్పదంటూ.. ఇద్దరికీ క్లాస్ పీకాడట. దట్ మీన్స్.. వివరించాడట. తామిద్దరం మళ్లీ ఇలా కలిసి పనిచేస్తున్నామంటే దానికి కారణం చెర్రీనే అని చెప్పేశాడు కోన వెంకట్.