పాపం అందరూ మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా చేయట్లేదని.. రామ్ చరణ్ సినిమాలోనే ఓ చిన్నరోల్ చేసేసి దానాని ల్యాండ్ మార్క్ మూవీగా సరిపెట్టేస్తున్నాడని చెప్పగానే.. అయ్యో మాకు మెగాస్టార్ 150ను ఇలా చూసే భాగ్యం ఏంటి దేవుడా అంటూ మెగా ఫ్యాన్స్ బాగా ఫీలయ్యారు. అలనాటి చిరంజీవి అభిమానులు కూడా ఇలా గెస్ట్ రోల్ తో 150వ సినిమాను కానిచ్చేయడం ఏం బాలేదంటూ పబ్లిక్ గానే కామెంట్లు చేశారు. అసలు ఈ గొడవంతా ఎందుకు.. పదండి కోన వెంకట్ ను అడుగుదాం.
అసలు రైటర్ కోన వెంకట్ కు తెలియకుండా రామ్ చరణ్ సినిమాలో కొత్త క్యారెక్టర్ అనేది పెట్టరేమో. శ్రీను వైట్ల కూడా ఆగడు ఫ్లాపయిన తరువాత కోన వెంకట్ తో తిరిగి కలసి పనిచేస్తున్నాడు కాబట్టి, ఖచ్చితంగా కోన సలహా తీసుకునే చిరంజీవినైనా తీసుకుంటారేమో. ఇక ఈ విషయంపై కోన మాట్లాడుతూ.. ''రామ్ చరణ్ సినిమా గురించి ఏదిపడితే అది రాస్తుంటారు.. మీరు నమ్మకండి. ఈ మధ్యన రూమర్లు కూడా హ్యూమరస్ గా తయారయ్యాయ్'' అంటూ ఆయన పంచ్ వేశాడు. ఇక కొంతమంది సన్నిహిత వర్గాలు ఇదే విషయాన్ని అడిగితే.. అసలు చెర్రీ సినిమాల్లో చిరంజీవి రోల్ అనే ఐడియానే ఎవ్వరికీ రాలేదట. అంతేకాదు.. చిరంజీవి తన పొలిటికల్ కమిట్‌మెంట్స్ తో బిజీగా ఉన్నారు కాబట్టి.. ఇప్పుడసలు ఆయన్ను టచ్ చేసే ఉద్దేశ్యం కూడా ఎవ్వరికీ లేదని తెలుస్తోంది. షూటింగ్ పూర్తయ్యాక సెప్టెంబర్ లో సినిమా తొలికాపీ చూస్తానని చెప్పారట చిరంజీవి. అది సంగతి.