సుధీర్ఘకాలం తర్వాత నేరుగా ఓ తెలుగు సినిమాతో సందడి చేయబోతోంది శ్రీదేవి. రచయిత కోన వెంకట్ చెప్పిన కథకి ఆమె ఓకే చెప్పేసింది. మరో రెండు మూడు నెలల్లో ఆ సినిమా స్టార్ట్ అయినా అవ్వొచ్చన్న సంకేతాల్ని పంపించింది. ఓ ప్రముఖ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో శ్రీదేవి ఆ విషయాన్ని వెల్లడించింది. కోన కథలో శ్రీదేవి నటించబోతోందన్న విషయం చాలా రోజులుగా వార్తల్లో ఉంది. అయితే శ్రీదేవి వైపు నుంచి రెస్పాన్స్ ఏంటన్నది మాత్రం ఇన్నాళ్లూ బయటికి రాలేదు. తాజాగా ఆమె ఓకే చెప్పేసింది. కథ బాగుందట, ఇప్పుడు డిస్కషన్స్ జరుగుతున్నాయట. అయితే అది ఎవరి దర్శకత్వంలో తెరకెక్కుతుందన్నది మాత్రం సస్పెన్స్ గా ఉంది. మరి ఆ సినిమాని నేరుగా తెలుగులోనే తీస్తారా లేదంటే శ్రీదేవి మార్కెట్ ని బేస్ చేసుకొని హిందీ - తమిళంలోనూ తీస్తారా అన్నది తేలాల్సి వుంది.
కోన వెంకట్ కీ - శ్రీదేవి భర్త బోనీకపూర్ కీ మంచి అనుబంధం ఉంది. వాళ్లిద్దరూ రామ్ గోపాల్ వర్మ ద్వారా పరిచయమయ్యారు. బోనీ కపూర్ ద్వారానే శ్రీదేవికి కోన కథ వినిపించాడట. ఆ సినిమాని బోనీ కపూరే స్వయంగా నిర్మించొచ్చని ప్రచారం సాగుతోంది. కోన మామూలుగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలంటూ రాస్తే అవి హార్రర్ థ్రిల్లర్ నేపథ్యంలోనే రాస్తుంటాడు. మరి శ్రీదేవి కోసం ఎలాంటి కథ రాశాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు అతిలోక సుందరిగా తన అందంతో కట్టిపడేసిన శ్రీదేవిని ఇప్పుడు భయపెట్టే పాత్రలో చూపించే సాహసం మాత్రం చేయకపోవచ్చు కోన. స్వతహాగా శ్రీదేవి కూడా కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు పాటిస్తోంది. తనకి నప్పని కథల్ని అస్సలేమాత్రం ఒప్పుకోవడం లేదు. ఇంతకుముందున్న ఇమేజ్‌ని పాడుచేసుకోవడం ఆమెకి ఇష్టం లేదు. అందుకే తన స్థాయికి తగ్గట్టుగా దమ్మున్న పాత్రల్నీ, కథల్ని మాత్రమే ఎంచుకొనే ప్రయత్నం చేస్తోంది. కోన కథని శ్రీదేవి బాగుందని చెప్పిందంటే ఆయన దమ్మున్న పాత్రనే సృష్టించుంటాడని అర్థమవుతోంది. త్వరలోనే `పులి`తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అతిలోక సుందరి.