మెగాస్టార్ చిరంజీవి వాల్తేర్ వీరయ్య సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మెగాస్టార్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికి కూడా డీసెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది. ఇక ఇప్పటికే ఈ మూవీ 150 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ ని కూడా నిర్వహించేసారు. మళ్ళీ ఒకప్పటి స్థాయిలో మెగాస్టార్ లో కామెడీ టైమింగ్ పెర్ఫార్మెన్స్, డాన్స్ గ్రేస్, ఎనర్జీ వాల్తేర్ వీరయ్య సినిమాలో ఉన్నాయని ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఇక దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా సినిమాని మరో ఎత్తుకి తీసుకెళ్ళింది.
అవుట్ అండ్ అవుట్ కామెడీతో కథని నడిపించి ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ లో కథలో కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్ ని ప్రెజెంట్ చేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమా విషయంలో చిరంజీవి దర్శకుడు బాబీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అదే సమయంలో ఆచార్య సినిమా ఫ్లాప్ ని పదే పదే గుర్తు చేస్తూ కొరటాల శివపై పరోక్షంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. మెగాస్టార్ విమర్శలకి కొరటాల శివ తిరిగి సమాధానం కూడా చెప్పలేని పరిస్థితిలో ప్రస్తుతం ఉన్నారు. ప్రస్తుతం ఆయన దృష్టి మొత్తం ఎన్టీఆర్ సినిమాపైనే పెట్టారు.
ఇదిలా ఉంటే తాజాగా దర్శకుడు బాబీ వాల్తేర్ వీరయ్య సినిమా గురించి చెబుతూ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. ఈ సినిమా స్టొరీ ఐడియా అనుకుంటున్నప్పుడు మెగాస్టార్ చిరంజీవిని దృష్టిలో ఉంచుకొని ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ తో స్క్రిప్ట్ అనుకుంటున్నా అని కొరటాల శివకి మొదటిసారిగా చెప్పానని బాబీ చెప్పుకొచ్చారు. స్టొరీ ఐడియా బాగుందని, కచ్చితంగా వర్క్ అవుట్ అవుతుందని, బలంగా నమ్మి చిరంజీవికి చెప్పమని సలహా ఇచ్చారు. అదే స్ఫూర్తితో ఈ మూవీ స్టొరీ లైన్ రెడీ చేసుకొని చిరంజీవికి చెప్పడం, ఆయన ఒకే చెయ్యడం జరిగిందని బాబీ చెప్పుకొచ్చారు.
అయితే వాల్తేర్ వీరయ్య సినిమా సక్సెస్ క్రెడిట్ ని బాబీకి ఇస్తూనే ఆచార్య సినిమాపై కొరటాల మీద విమర్శలు చేస్తున్న చిరంజీవికి కూడా ఈ విషయం తెలిసి ఉండదేమో అనే మాట ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తుంది. కొరటాలకి ఈ స్టొరీ లైన్ బాబీ చెప్పాడని తెలిస్తే చిరంజీవి రియాక్షన్ ఎలా ఉంటుందో కదా అని కొంత మంది యాంటీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తూ ఉండటం విశేషం. ఏది ఏమైనా వాల్తేర్ వీరయ్య స్టొరీ విషయంలో ఆరంభంలోనే కొరటాల శివ ప్రమేయం కూడా ఉందనే మాట ఇప్పుడు బయటకి రావడంతో టాలీవుడ్ సర్కిల్ లో ఆసక్తికరంగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.