గత నెల రోజులుగా వార్తల్లో నిలుస్తున్న సినిమా 'ఆచార్య'. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలిసారి కలిసి నటించిన మూవీ ఇది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వైఫల్యాన్ని చవిచూసింది. దీంతో ఈ మూవీ బయ్యర్లకు భారీ నష్టాలని మిగిల్చి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై కొణిదెల ప్రొడక్షన్స్ తో కలిసి నిర్మాత నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. అయితే గుడ్ విల్ కింద మాత్రమే కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ ని ఈ మూవీకి యాడ్ చేశారు. ఇందులో వీరి పెట్టుబడి కానీ ఏమీలేదట. ఇదిలా వుంటే మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ కలిసి నటించిన తొలి మూవీ కావడంతో 'ఆచార్య'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బిజినెస్ కూడా భారీగానే జరిగిందట.
అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ఆశించిన ఫలితాన్ని అందించకపోగా భారీ డిజాస్టర్ గా నిలిచి డిస్ట్రిబ్యూటర్లకు కోట్లల్లో నష్టాలని తెచ్చిపెట్టింది. ఇక్కడి నుంచే అసలు కథ మొదలైంది. ఈ మూవీ నష్టాలు మొత్తం ఇప్పడు దర్శకుడు కొరటాల శివ మొగకు చుట్టుకున్నాయని వార్తలు మొదలయ్యాయి. ఈ మూవీతో భారీ నష్టాలని ఎదుర్కొన్న డిస్ట్రిబ్యూటర్లు తమ నష్టాలని తిరిగి చెల్లించమంటూ దర్శకుడు కొరటాల వెంటపడుతున్నారట.
ఈ నేపథ్యంలో ఈ మూవీ కోసం మెగా హీరోలు పారితోషికం కింద 60 కోట్లు తీసుకున్నారని, అందులో 20 కోట్లు తిరిగి ఇచ్చేశారని, కొరటాల మాత్రం కేవలం 4 కోట్లు మాత్రమే తీసుకున్నాడని ఈ విషయంలో ఆయనని ఒంటరిని చేశారని, ఈ సినిమా విషయంలో కొరటాలకు న్యాయం జరగలేదంటూ నెట్టింట 'జస్టీస్ ఫర్ కొరటాల' అనే హ్యాష్ ట్యాగ్ తో కామెంట్ లు చేస్తుండటం ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది. 200 కోట్ల బిజినెస్ జరిగిన సినిమాకు ఈ రేంజ్ లో నష్టాలు ఎందుకు వచ్చాయని, ఆ నష్టాలని పూడ్చడం కోసం దర్శకుడు కొరటాల శివ తన ఆస్తులు ఎందుకు అమ్ముకోవాల్సి వస్తోందని జరుగుతున్న ప్రచారంపై కొంత మంది కామెంట్ లు చేస్తున్నారు.
డైరెక్టర్ గా తన పని పూర్తయినా కూడా తన స్నేహితుడు నిరంజన్ రెడ్డి నిర్మాత కావడంతో కొరటాల శివ ఈ మూవీ రిలీజ్ బాధ్యతల్ని కూడా తనపై వేసుకున్నారట. ఆ కారణంగానే ప్రస్తుతం డిస్ట్రిబ్యూటర్ల వల్ల ఇబ్బదులు ఎదుర్కొంటున్నారని, వారి నష్టాలని పూడ్చే పనిలో భాగంగానే ఆస్తులు అమ్ముకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఓటీటీ ల నుంచి, శాటిలైట్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ ఛానల్ నుంచి కొరటాలకు బిగ్ ఝలక్ తగిలిందని చెబుతున్నారు. ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం కాజల్ హీరోయిన్ గా నటిస్తున్నట్టుగా, ఆమె పాత్ర వున్నట్టుగా అగ్రిమెంట్ చేసుకున్నారట. ఫైనల్ వెర్షన్ కి వచ్చేసరికి కాజల్ పాత్రని కంప్లీట్ గా తొలగించిన విషయం తెలిసిందే.
ఇదే విషయంలో ఓటీటీ సంస్థ, శాటిలైట్ రైట్స్ ని దక్కించుకున్న ఎంటర్ టైన్ మెంట్ ఛానల్ వారు బ్యాలెన్ష్ లో భారీ కోతని విధించారట. దీని మొత్తం దాదాపుగా 7 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇంత పెద్ద మొత్తం కోత విధించడంతో కొరటాల ఇప్పడు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడాలన్నా ఆచార్యుడి డిజాస్టర్ స్టోరీ వెనకున్న అసలు కథ బయటికి రావాలన్నా మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ, నిర్మాత నిరంజన్ రెడ్డి నోరు విప్పాల్సిందే అని నెట్టింట, ఇండస్ట్రీ వర్గాల్లోనూ హాట్ చర్చ జరుగుతోంది.