యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కొరటాలకు ఎంతటి సన్నిహితుడో తెలిసిందే. రచయితగా కెరీర్ ఆరంభం నుంచి ఎన్టీఆర్ కి కొరటాల శివ సన్నిహితుడు. ఇంతకుముందు ఈ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ వచ్చింది. ఇప్పుడు మరోసారి తారక్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమాకు రంగం సిద్దమవుతోన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రారంభం కానుంది. తారక్ నటిస్తోన్న `ఆర్.ఆర్.ఆర్` కూడా జనవరి 7న రిలీజ్ అయిపోతుంది. అనంతరం ఎన్టీఆర్ ఫ్రీ అయిపోతారు. ఈ నేపథ్యంలో ఈ జోడీ మూవీ లాంచింగ్ కి మంచి ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో సినిమా లాంచ్ చేసి అదే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారుట. మరి వీళ్లిద్దరు ఈసారి ఎలాంటి కంటెంట్ తో ముందుకు రాబోతున్నారు అని ఆరా తీస్తే పలు ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి.
తారక్ కోసం ఈసారి ట్రెండీ సబ్జెక్ట్ ని కొరటాల రెడీ చేశారట. స్టూడెంట్స్ పాలిటిక్స్ నేపథ్యంలో సాగే చిత్రమిదని అంటున్నారు. కొరటాల మార్క్ క్లాసీ టచ్ తెరపై కనిపించనుందని గుసు గుస వినిపిస్తోంది. అయితే ఇదే కథను ఇంతకు ముందు అల్లు అర్జున్ కి కొరటాల చెప్పారు. కానీ బన్నీ ఆ కథపై ఆసక్తి చూపించలేదు. ఈ నేపథ్యంలోనే ఇదే కథను మళ్లీ ఎన్టీఆర్ కి చెప్పి ఒప్పించినట్లు తెలుస్తోంది. మరి బన్నీ ఎందుకు రిజెక్ట్ చేసినట్లు? అంటే ఇందులో యాంగర్ మేనేజ్ మెంట్ కీలకం కానుందిట. పాలిటిక్స్.. లీడర్ షిప్ క్వాలిటీస్ స్క్రిప్ట్ కాబట్టి సహజంగా పాత్రలో యాంగర్ మేనేజ్ మెంట్ తప్పనిసరి. కానీ బన్నీకి యాంగర్ మేనేజ్ మెంట్ కలిసి రావడం లేదు. గతంలో బన్నీ నటించిన `నా పేరు సూర్య` యాంగర్ మేనేజ్ మెంట్ బేస్డ్ స్క్రిప్ట్.
ఆ సినిమా ఎలాంటి ఫలితాలు సాధించిందో తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బన్నీ కొరటాల స్క్రిప్టు ని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ కి మాత్రం పక్కాగా యాప్ట్ అయ్యే స్టోరీ ఇదని తెలుస్తోంది. గతంలో ఇదే నేపథ్యంలో ఎన్టీఆర్ `నాగ` అనే సినిమా చేసారు. కానీ ఆ చిత్రం అప్పట్లో పెద్దగా సక్సెస్ అవ్వలేదు. అందులో చాలా లోపాలున్నాయి. కానీ కొరటాల స్క్రిప్ట్ హీరోని ఆవిష్కరించే తీరు తెన్నులు ఎలా ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. ఈ నేపథ్యంలో తారక్ కి కి ఇది పక్కా యాప్ట్ స్టోరీగా చెప్పొచ్చు. ఇకపోతే అరవింద సమేత వీర రాఘవ చిత్రంలోనూ తారక్ ని కొంత యాంగర్ మేనేజ్ మెంట్ వైపు నడిచేవాడిగా త్రివిక్రమ్ చూపించిన సంగతి ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి.