హైదరాబాదీలు ఈ సారి కూడా బద్దకించారు. సెలబ్రిటీలు తమ పనులు మానుకుని ప్లాన్ చేసుకుని మరీ ఓటు వేయడానికి వస్తుంటే... సామాన్య హైదరాబాదీలు మాత్రం చాలా బద్దకించారు. గత ఏడాది కంటే పోలింగ్ శాతం దారుణంగా పడిపోయింది. మధ్యాహ్నం 3 గంటలకు ఓటింగ్ శాతం 35 మాత్రమే ఉండటంపై దర్శకుడు కొరటాల శివ తీవ్ర అసహనం వ్యక్తంచేశారు.
అర్బన్ ఓటర్... షేమ్ ఆన్ యు.. అంటూ కొరటాల శివ ట్వీట్ చేశారు. అయితే అంతకుముందు రోజు ఓటు వేయండి అంటూ కొరటాల శివ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆయనతో పాటు అనేక మంది సెలబ్రిటీలు కూడా ఓటు వేయండి అని జనాలను కోరారు. చాలా రోజుల నుంచి ఎన్నికల కమిషన్ కూడా అన్ని ఏర్పాట్లు చేసి, సెలవు ఇప్పించినా అర్బన్ ఓటరు అస్సలు ఇంటి నుంచి కదల్లేదు. చాలామంది సెలవులకు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా నిజంగా కొరటాల శివ ఆగ్రహానికి అందరం మద్దతు పలకాల్సిందే... షేమ్ ఆన్ అర్బన్ ఓటర్!