అక్కడ ఎన్టీఆర్‌ డైలాగ్‌ కట్ చేసి...

Update: 2016-07-06 22:30 GMT
ఇప్పుడు యంగ్‌ టైగర్ చెప్పిన ''జనతా గ్యారేజ్'' టీజర్ డైలాగ్‌ బాగా నానుతోంది. ''బలవంతుడు బలహీనుడ్ని భయపెట్టి బ్రతకడం ఆనవాయితీ.. ఫర్ ఏ ఛేంజ్‌.. ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది.. జనతా గ్యారేజ్.. ఇచట అన్ని రిపేర్లు చేయబడును'' అంటూ మనోడు చెప్పిన డైలాగ్‌ బలే ఉందే అంటున్నారు జనాలు. అయితే ఈ డైలాగ్‌ ఎన్టీఆర్ కాకుండా వేరే నటుడు చెబితే ఎలా ఉంటుంది?

మొదటి నుండీ మలయాళంలో కూడా సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయాలనే ప్లానుతో.. అక్కడి సూపర్ స్టార్‌ మోహన్‌ లాల్ ను తీసుకున్న దర్శకుడు కొరటాల శివ.. తరువాత దేవయాని - ఉన్ని ముకుందన్‌ వంటి మల్లూ నటులను పెట్టుకున్నాడు. పైగా మల్లూ వర్షన్‌ పోస్టర్లలో కూడా మోహన్ లాల్ ఇమేజ్ నే ముందుగా ప్రొజక్టు చేస్తున్నారు. ఇప్పుడు 'జనతా గ్యారేజ్' మల్లూ ట్రైలర్‌ లో.. ముందుగా మోహన్‌ లాల్ ను చూపించి.. ''ఇచట అన్నీ రిపేర్లు చేయబడును'' అంటూ ఆయనతోనే చెప్పించారు. ఎన్టీవోడి డైలాగును కట్ చేసి ఆయన వాయిస్ ను పోస్టు చేశారులే. ఇక సగం నుండి సేమ్ తెలుగు టీజర్ విజువల్సే వేశారులే.

మొత్తానికి ఒకేసారి తెలుగుతో పాటు మలయాళంలో కూడా రిలీజ్ చేయాలనే స్ర్టాటజీ అయితే బాగుంది. చూద్దాం అల్లు అర్జున్ టైపులో ఎన్టీఆర్ కూడా మల్లూవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక ఏర్పాటు చేసుకుంటాడేమో మరి.
Tags:    

Similar News