1 నేనొక్కడినే ఫ్లాప్ అయి ఉండొచ్చు. కానీ అది గొప్ప సినిమా అని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. ఐఎండీబీ సైతం ఆ సినిమాకు హాలీవుడ్ థ్రిల్లర్స్ కంటే ఎక్కువ రేటింగ్ ఇచ్చి.. మన సినిమా గొప్పదనాన్ని చాటి చెప్పింది. ఈ సినిమా కోసం మహేష్, సుకుమార్ ఎంత కష్టపడి ఉంటారో సినిమా చూస్తేనే అర్థమవుతుంది. ఐతే ఓ మంచి సినిమా తీసి.. జనాలు ఆదరించనపుడు ఎంతో బాధ, అసహనం కలుగుతుందడనంలో సందేహం లేదు. కొందరైతే ప్రేక్షకులకి టేస్టు లేదని.. సినిమాలు చూడ్డం చేతకాదని తిట్టేస్తుంటారు. కానీ మహేష్ మాత్రం 1 నేనొక్కడినే విషయంలో అలా ఫీలవ్వలేదని అంటున్నాడు కొరటాల శివ.
1, ఆగడు ఫ్లాప్ అయిన నేపథ్యంలో శ్రీమంతుడు విషయంలో మీ మీద మహేష్ బాగా ప్రెజర్ తెచ్చాడా అని అడిగితే.. ‘‘మహేష్ అందరికీ సీరియస్ గా కనిపిస్తాడు కానీ.. అతను చాలా సరదా మనిషి. డిజప్పాయింట్మెంట్స్ ని కూడా ఆయన సీరియస్ గా కాకుండా కామెడీగా చూస్తారు. ‘ఏదో మంచి ప్రయత్నం చేశామండీ. కానీ పక్కను నెట్టేశారు’ అంటూ తన ఫెయిల్యూర్ మూవీ గురించి చెప్పాడు మహేష్’’ అని కొరటాల వెల్లడించాడు. షూటింగ్ స్పాట్ లో కూడా మహేష్ చాలా సరదాగా ఉంటాడన్నాడు. ‘‘మహేష్ భలే జోకులు పేలుస్తాడు. సినిమా శ్రీమంతుడు మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా క్షణానికో జోక్ వినిపించేది. ఇలా మాట్లాడి అలా తిరిగేలోపు ఓ పంచ్ వదిలేవాడు. వాళ్లూ వీళ్లూ అని తేడా లేదు. లైట్ బాయ్స్ తో కూడా జోకులేసి నవ్వించేవాడు. ఉదయం లొకేషన్ కి రావడమే నవ్వుతూ వస్తారు. ఇక రోజంతా ఆ నవ్వు కంటిన్యూ అవుతుంది. ఇంకో రెండు రోజుల్లో షూటింగ్ అయిపోతుందనగా నిర్మాతలు.. ‘ఈ నవ్వు మిస్ అయిపోతామండీ. ఈ నవ్వు కోసమే మహేష్ మళ్లీ డేట్స్ ఇస్తే బాగుండు’ అన్నారు. దీన్ని బట్టే మహేష్ ప్రెజెన్స్ షూటింగులో ఎంత ఎనర్జీ ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు’’ అన్నాడు కొరటాల.