భరత్ తో కొరటాలకు అంత గిట్టిందట

Update: 2018-04-04 05:42 GMT
ప్రస్తుతం టాప్ రేంజ్ దర్శకుల్లో కొరటాల శివ పేరు తప్పకుండా ఉంటాడు. క్రేజీ ప్రాజెక్టులను సెట్ చేసుకోవడమే లేదు.. వాటిని మార్కెట్ చేసుకోవడంలో ఈయన బాగా దిట్ట. కానీ భరత్ అనే నేను విషయంలో మాత్రం.. ఇప్పటివరకూ కొరటాల పాచికలు పారలేదట. గత కొన్ని నెలలుగా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ పడలేదు. పెద్ద సినిమాలు డిజప్పాయింట్ చేయడంతో పాటు.. మహేష్ గత రెండు సినిమాలు డిజాస్టర్స్ కావడంతో భరత్ అనే నేను చిత్రాన్ని భారీ రేట్లకు కొనేందుకు డిస్ట్రిబ్యూటర్స్ ముందుకు రాలేదని తెలుస్తోంది. కానీ ఇప్పుడీ సినిమాను కొరటాల తన టెక్నిక్స్ సహాయంతో గట్టి రేట్లకే అమ్మాడట.

గ్యారంటీగా భారీ ఓపెనింగ్స్ వస్తాయని మాటిస్తూ.. అలాగే కంటెంట్ పరంగా డిజప్పాయింట్ చేయదు అంటూ తను గ్యారంటీలు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. అలా భారీ రేట్లకు మార్కెటింగ్ డ్యూటీ కూడా తీసుకుని.. టేబుల్ ప్రాఫిట్ లో 8 కోట్లను కూడా వెనకేసుకున్నట్లు తెలుస్తోంది. మొదటగా అగ్రిమెంట్ ప్రకారం ఇవ్వాల్సిన 20 కోట్లకు.. ఈ 8 కోట్లు అదనం అన్నమాట.  మొత్తానికి ఒక్క భరత్ అనే నేను చిత్రం ద్వారా కొరటాలకు 28 కోట్లు మిగులుతాయన్న మాట. అయితే.. ఇదంతా భరత్ అనే నేను హిట్ అయితే మాత్రమే అని గుర్తుంచుకోవాలి. తేడా వస్తే తనదే బాధ్యత అన్నాడు కాబట్టి.. ఆమాత్రం తీసుకునేందుకు అర్హుడే అని చెప్పచ్చు. అయితే.. హీరో.. ప్రొడ్యూసర్ కంటే డైరెక్టర్ కే ఎక్కువ మిగలడం ఆశ్చర్యకరమే.

అయితే సినిమా లెక్కల్లో ఏమాత్రం తేడా వచ్చినా కూడా.. లాస్ కూడా భరిస్తాను అనడంతోనే మనోడికి అంతొచ్చింది అంటున్నారు ట్రేడ్ పండితులు. ఎందుకంటే ఈ సినిమా విషయంలో దిల్ రాజు వంటి హేమాహేమీలు కూడా వెనకడు వేయగా.. కొరటాల ఇచ్చిన ప్రామిస్ అంత పనిచేసింది. అయితే తన మాట నిలబడి గట్టి ఓపెనింగులు రావడం  కోసమే.. చరణ్‌ ఎన్టీఆర్ లను ప్రీ-రిలీజ్ ఈవెంటుకు పిలిచే స్కెచ్ కూడా వేశాడని మరో టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా కూడా.. కొరటాల అను నేను.. భలే డిఫరెంట్ డైరక్టర్ అన్నట్లుంది యవ్వారం.
Tags:    

Similar News