యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కొరటాల సినిమా అనగానే ప్రాజెక్ట్ ప్రకటించగానే బ్లాక్ బస్టర్ అనే అంచనాలు ఏర్పడిపోయాయి. అటు ఎన్టీఆర్ రెండు హిట్స్ కొట్టి ఫామ్ లో ఉండడం.. ఇటు కొరటాల ఇద్దరు హీరోలకు కెరీర్ బెస్ట్ అందించడం.. అందులో ఒకటి ఇండస్ట్రీ హిట్ కావడంతోనే ఇంత క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు జనతా గ్యారేజ్ ఆడియో ఫంక్షన్ సందర్భంగా.. ఎన్టీఆర్ తో మూవీ చేసినందుకు తన సంతోషాన్ని.. జూనియర్ తో తన అనుబంధాన్ని పంచుకున్నాడు కొరటాల శివ.
ఇది నా ఫ్యామిలీ ఫంక్షన్ లా ఫీలవుతున్నా అంటూ స్టార్ట్ చేసిన కొరటాల శివ.. ఈ సినిమా తనకు చాలా స్పెషల్ అన్నాడు. అన్నయ్యతో నా రిలేషన్ షిప్ స్పెషల్ అనడంతో ఎవరిని అన్నయ్య అన్నాడో ముందు అందరికీ అర్ధం కాలేదు. 'రైటర్ గా ఎదగనప్పుడే బృందావనం రాశా. ఎన్టీఆర్ నాకు అన్నయ్య.. నన్ను మీ అందిరకీ పరిచయం చేశారు. నీ గురించి ఎన్టీఆర్ మాట్లాడ్డం విన్నామంటూ అందరూ అభినందించారు. అలా ఆయనతో అనుబంధం మొదలైంది' అన్నాడు కొరటాల శివ.
'అందుకే ఎన్టీఆర్ సినిమా అంటే చాలా స్పెషల్. నా పెన్ను ఆయన కోసం ఇంకా కాస్త ఎక్కువ రాస్తుంది. ఆయన ఎనర్జీకి తగ్గట్లుగా రాయాలి అనుకుంటాను. ఓ సీన్ చెబ్తే అన్నయ్య ఎగ్జైట్ మెంట్ ఇస్తారు. దీంతో మరింతగా పర్ఫెక్ట్ గా చేయగలుగుతాను. బృందావనంతో మా రిలేషన్ స్టార్ట్ అయింది. జనతా గ్యారేజ్ తో బ్లాక్ బస్టర్ కొట్టి ఆయనతో ఈ రిలేషన్ ఎప్పటికీ మెయింటెయిన్ చేస్తానని ప్రామిస్ చేస్తున్నా' అని చెప్పిన కొరటాల.. జై ఎన్టీఆర్ అంటూ అభిమానుల్లో జోష్ నింపాడు.
'దేశంలో గొప్ప యాక్టర్లలో ఒకరు మోహన్ లాల్. కాలాపానీ లాంటి సినిమాలు చూస్తూ పెరిగాను. చాలా సుడి ఉంది నాకు. అందుకే మోహన్ లాల్.. ఎన్టీఆర్ లను ఒకే ఫ్రేమ్ లో పెట్టి యాక్షన్ చెప్పా' అన్న దర్శకుడు. తన ప్రతి సినిమా సక్సెస్ అని అంటున్నారని.. ఇందుకు కారణం బెస్ట్ టీమ్ తీసుకోవడమేనని సక్సెస్ సీక్రెట్ చెప్పేశాడు. మూడొంతులు సినిమాను వాళ్లే మోసేస్తారని ఓపెన్ గా చెప్పడం విశేషం.