కొరటాల గురి ఖైదీ మీదేనా?

Update: 2017-02-16 05:22 GMT
దర్శకుడు కొరటాల శివ.. మహేష్ బాబుతో రెండో సినిమాకి రెడీ అయిపోతున్నాడు. ఇప్పటికి మూడు సినిమాలు తీసిన కొరటాల శివ.. మూడింటితోనూ ఆయా హీరోలకు కెరీర్ బెస్ట్ ఇచ్చేశాడు. మిర్చితో ప్రభాస్ కు బ్లాక్ బస్టర్.. శ్రీమంతుడుతో మహేష్ కు అప్పటికి ఇండస్ట్రీ సెకండ్ బిగ్గెస్ట్ హిట్.. రీసెంట్ గా జనతా గ్యారేజ్ తో మరో ఇండస్ట్రీ హిట్ కొట్టిన కొరటాల.. ఇప్పుడు మళ్లీ మహేష్ తో జత కడుతున్నాడు.

సూపర్ స్టార్ తో ఈ దర్శకుడు చేసే కొత్త సినిమా ఏప్రిల్ లో ప్రారంభం కానుండగా.. ఈ చిత్రం కోసం పెద్ద టార్గెట్ నే పెట్టుకున్నాడట కొరటాల శివ. అందుకే ఇప్పటివరకూ ఒకే టీంతో పని చేసిన ఈ దర్శకుడు.. ఇప్పుడు కొత్త టీంను తెచ్చుకుంటున్నాడు. స్టోరీని వేరే రైటర్ నుంచి తీసుకున్నాడు.. కెమేరామ్యాన్ గా రవి కె చంద్రన్ ను తీసుకొచ్చాడు.. అలాగే డైరెక్షన్ డిపార్ట్ మెంట్ ట్యాలెంటెడ్ పర్సన్స్ ను తీసుకున్నాడు. మహేష్ బాబుతో చేసే సినిమాను ఇండస్ట్రీ హిట్ గా నిలపాలన్నది కొరటాల టార్గెట్ అంటున్నారు.

శ్రీమంతుడుతో 86 కోట్ల షేర్ సాధించిన సినిమా తీసిన కొరటాల.. ఇప్పటివరకూ ఇండస్ట్రీ సెకండ్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. రీసెంట్ గా మెగాస్టార్ ఖైదీ నంబర్ 150 మూవీ ఆ రికార్డుకు ఎసరు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మహేష్ తో చేయనున్న మూవీతో.. తన గత రికార్డును అధిగమించడంతోపాటు.. 100 కోట్ల షేర్ సాధించే లక్ష్యాన్ని పెట్టుకున్నాడట. మహేష్ బాబుతో కలిసి ఖైదీ నంబర్ 150 రికార్డ్ ను దాటడమే కొరటాల శివ టార్గెట్ అనే టాక్ వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News