నాలుగే నాలుగు సినిమాలతో టాలీవుడ్ టాప్ మోస్ట్ డైరెక్టర్లలో ఒకడైపోయాడు కొరటాల శివ. ప్రస్తుతం తెలుగులో రాజమౌళి తర్వాతి స్థానం అతడిదే అనడంలో సందేహం లేదు. వరుసగా నాలుగు సినిమాలతోనూ నలుగురు స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్లు ఇస్తే ఆ దర్శకుడి క్రేజ్ ఎలా ఉంటుందో చెప్పేదేముంది? అందుకే కొరటాల ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయ్యాడు. రాజమౌళిలా సినిమాకు సినిమాకు మరీ ఎక్కువ విరామం కూడా తీసుకోడు.. అందుబాటులో ఉంటాడు కాబట్టి కొరటాలతో సినిమా కోసం స్టార్లు రెడీగా ఉంటారు. ఐతే దర్శకుడిగా తన తర్వాతి సినిమా ఏదో ఇంకా ఖరారు చేయని కొరటాల త్వరలోనే కొత్త అవతారంలో కనిపించబోతున్నట్లు సంకేతాలు ఇచ్చాడు. అతను నిర్మాతగా మారనున్నాడట.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో కొరటాల ఈ విషయం చెప్పాడు. ఎవరైనా కొత్త తరహా.. ప్రయోగాత్మక కథలతో తన దగ్గరికి వచ్చి మెప్పిస్తే.. ఆ కథలకు సహకారం అందిస్తానని.. తనే నిర్మాతగా ఉండి సినిమాలు తీస్తానని కొరటాల చెప్పాడు. రాజమౌళి.. త్రివిక్రమ్.. సుకుమార్.. పూరి జగన్నాథ్.. ఇలా చాలామంది స్టార్ డైరెక్టర్లు నిర్మాతలుగా మారి సినిమాలు చేసిన వాళ్లే. ఇలాంటి దర్శకులు చేతి నుంచి డబ్బులు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. వాళ్ల పేరు పోస్టర్ మీద ఉంటే చాలు.. ఈజీగా ఫైనాన్స్ సమకూరుతుంది. వేరే వాళ్లు పెట్టుబడి పెట్టి సినిమాలు తీయడానికి ముందుకొస్తారు. కొరటాలకు ఇప్పుడున్న క్రేజ్ లో ఆయన ప్రొడ్యూసర్ అయితే ఆ ప్రాజెక్టుకు ఆటోమేటిగ్గా క్రేజ్ వస్తుందనడంలో సందేహం లేదు. మరి కొరటాల ఇచ్చిన ఈ ఓపెన్ ఆఫర్ ను సద్వినియోగం చేసుకుని ఎంతమందికి యువ దర్శకులు ఆయన్ని తమ కథలతో మెప్పించి అవకాశాలు అందుకుంటారో చూడాలి.