మహేష్ మూవీకి వెంకన్న సెంటిమెంట్

Update: 2017-05-08 06:25 GMT
సినిమా పరిశ్రమలో సెంటిమెంట్స్ చాలా కామన్. ఆ సెంటిమెంట్ కనుక ఓ సక్సెస్ అందిస్తే.. ఇక దాన్ని పట్టుకుని వేలాడేయడం సర్వ సాధారణం. దర్శకుడు కొరటాల శివకు  కూడా ఇలాంటి సెంటిమెంట్ ఉందని అంటున్నారు.

గతంలో నిర్మాత డి.రామానాయుడుకు ఓ సెంటిమెంట్ ఉండేది. ప్రతీ సినిమా ప్రారంభానికి ముందే.. ఫైనల్ స్క్రిప్ట్ ను తిరుమల శ్రీనివాసుని పాదాల చెంత ఉంచడం ఆనవాయితీ. ఇప్పుడు కొరటాల కూడా ఇదే ఫాలో అవుతున్నాడట. మొదటగా మిర్చి మూవీకి ఇదే చేసిన కొరటాల.. శ్రీమంతుడు.. జనతా గ్యారేజ్ లకు కూడా ఫైనల్ స్క్రిప్ట్ ను వెంకటేశ్వరుని పాదాలపై ఉంచిన తర్వాత సినిమా మొదలు పెట్టాడు. ఆ మూడు మూవీస్ ఏ స్థాయి సక్సెస్ సాధించాయో తెలిసిందే. ప్రతీ హీరోకు కెరీర్ బెస్ట్ హిట్.. ఇండస్ట్రీ హిట్స్ లో చోటు సంపాదించేసే హిట్ ఇవ్వడం అంటే మాటలు కాదు.

ఇప్పుడు మహేష్ మూవీ కోసం ఇదే చేస్తున్నాడు కొరటాల. ఇప్పటికే ఫైనల్ స్క్రిప్ట్ రెడీ అయిపోగా.. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్ర స్క్రిప్ట్ ను.. శ్రీనివాసుని పాదాలపై ఉంచి పూజ చేసే కార్యక్రమాన్ని పూర్తి చేశాడు కొరటాల. యాక్షన్ జోనర్ లో రూపొందే ఈ సినిమాలో.. మహేష్ బాబు కేరక్టర్ కొత్తగా ఉండమడే కాదు. అందరినీ ఆకట్టుకుంటుందని నమ్మకంగా ఉన్నాడు కొరటాల.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/

Tags:    

Similar News