అందులోకి ఎంటర్ అవుతున్న కొరటాల

Update: 2018-12-18 08:18 GMT
మహేష్ బాబు కు 'భరత్ అనే నేను' లాంటి సూపర్ హిట్ సినిమా ను ఇచ్చిన దర్శకుడు కొరటాల శివ తన నెక్స్ట్ సినిమాను ఇంకా ప్రారంభించలేదు.  మెగాస్టార్ చిరంజీవి తో సినిమా ఫైనల్ అయిందిగాని చిరు 'సైరా' షూటింగ్ తో బిజీగా ఉండడం వల్ల కొరటాల ప్రాజెక్ట్ ఆలస్యం అవుతోంది. జనవరి లో లాంచ్ చేసేందుకు ప్లాన్ చేసినా ఇప్పుడు వీలుకావడం లేదట. దీంతో చిరు కోసం కొరటాల మరి కొద్ది నెలలు వేచి చూడక తప్పేలా లేదని అంటున్నారు.

దీంతో ఈ గ్యాప్ ను కొరటాల మరో రకంగా ఉపయోగించుకునే ప్రయత్నాల్లో ఉన్నాడట.  లీడింగ్ డిస్ట్రిబ్యూటర్ మిక్కిలినేని సుధాకర్ కొరటాల శివ కు క్లోజ్ ఫ్రెండ్ అనే విషయం తెలిసిందే.  వచ్చే ఏడాది సుధాకర్ బ్యానర్ లో ఎన్టీఆర్ హీరో గా కొరటాల ఒక సినిమాను చేసేందుకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.  చిరంజీవి సినిమా పూర్తి కాగానే ఈ సినిమాను పట్టాలెక్కిస్తారు.  ఈ ప్రాజెక్ట్ కు ఇంకా సమయం ఉంది.  అంతలోపు కొరటాల - సుధాకర్ ఇద్దరూ కలిసి లో-బడ్జెట్ తో కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలను నిర్మించాలని ప్లాన్ చేస్తునారట. ఈ సినిమాల కు కొరటాల సమర్పకుడి గా కూడా వ్యవహరిస్తాడట.  ఇప్పటికే ఈ దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయట.  

టాలీవుడ్ లో మరో స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఇప్పటికే చిన్న చిత్రాల నిర్మాణంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.  సుక్కు ఈ మధ్య జోరు పెంచి పలు కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలను ఒకే సారి నిర్మిస్తున్నాడు. ఇప్పుడు ఇదే బాటలో కొరటాల శివ కూడా పయనించడం విశేషమే.   


Tags:    

Similar News