క్యారెక్టర్ ఎలాంటిదైనా తన యాక్టింగ్ తో ఆ పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా నటించడం నేచురల్ స్టార్ నాని స్పెషాలిటీ. ఇక తొలిసినిమా ప్రేమమ్ తో మొత్తం మళయాళ ప్రేక్షకులను.. ఫిదాతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన హీరోయిన్ సాయి పల్లవి. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) సినిమా స్టార్టయినప్పటి నుంచే ప్రేక్షకుల్లో బజ్ ఏర్పడింది.
ఎంసీఏ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. తాజాగా ఈ సినిమాలోని ఓ పాటను యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. కొత్తకొత్తగా.. రెక్కలొచ్చినట్టుగా క్షణము ఒక్క నిమిషమల్లే గడుపుదాం పద అంటూ సాగే ఈ పాట హీరో హీరోయిన్ల మధ్య వచ్చే డ్యూయట్ గా సినిమాలో ఉంటుంది. కాస్తంత మెలోడీగా అనిపించే పాటకు బీట్ జోడించి దేవిశ్రీ ప్రసాద్ డిఫరెంట్ గా మ్యూజిక్ అందించాడు. శ్రీమణి రాసిన ఈ పాటను సాగర్.. ప్రియ హేమేష్ పాడారు. దేవిశ్రీకి బాగా అలవాటయిన స్టయిల్లో చాలా ఫాస్ట్ గా పాట సాగిపోతుంటుంది. మొత్తంమీద దేవి మ్యూజిక్ రొటీన్ అయిపోతోందనే కామెంట్ వస్తున్న నేపథ్యంలో కాస్త డిఫరెంట్ గా ట్రై చేసినట్టే అనిపిస్తుంది. పాట సాహిత్యపరంగా అయితే ఓకే అనే అనిపిస్తుంది. మొత్తం మీద మొదటిసారి విన్నప్పుడే హమ్ చేయగలిగేంత గొప్పగా అనిపించకపోయినా వినగావినగా నచ్చేలా పాట ఉంటుంది.
సినిమాలో ఏదో ఒకటి రెండు పాటలు కాకుండా మొత్తం ఆల్బమ్ అంతా బాగుందని అనిపించేలా మ్యూజిక్ ఇచ్చిన ఘనత దేవి శ్రీ ప్రసాద్ ది. ఈమధ్య ఆ మ్యాజిక్ కాస్త మిస్సవుతోంది. ఎంసీఏ సినిమాతో ఆ రిమార్కును తొలగించుకుంటాడో.. లేక అదే స్టయిల్ కొనసాగిస్తాడో.. మిగతా పాటలు రిలీజయ్యాకే చెప్పగలం.
Full View