క‌వ‌ర్ చినిగేలా వేడి పెంచిన క్రాక్ గాళ్!

Update: 2021-01-13 04:00 GMT
మాస్ మ‌హారాజ్ ర‌వితేజ స‌ర‌స‌న క్రాక్ చిత్రంలో న‌టించింది శ్రుతిహాస‌న్. చాలా గ్యాప్ త‌ర్వాత టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన శ్రుతికి `క్రాక్` పాజిటివ్ రిపోర్ట్ తీపి గుళిక లాంటిదేన‌నే చెప్పాలి. త‌దుప‌రి స‌మ్మ‌ర్ కానుక‌గా ప‌వ‌ర్ స్టార్ స‌ర‌స‌న న‌టించిన వ‌కీల్ సాబ్ రిలీజ్ కానుంది.

కంబ్యాక్ కోసం ఎంత‌గానో త‌పిస్తున్న శ్రుతికి కొత్త ఏడాది పాజిటివ్ నోట్ తోనే మొద‌లైంది. ఇన్ స్టా వేదిక‌గా క్రాక్ కి శ్రుతి అద్భుత ప్ర‌చారం చేసింది. మీడియా ఇంట‌ర్వ్యూ ల‌కు మాత్రం చాలా దూరంగా ఉండ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిచ్చింది. ఇక‌పోతే ఇన్ స్టాలో శ్రుతి లేటెస్ట్ ఫోటోషూట్ హీట్ పెంచింది.

ది క్యాండీ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై అందాల శ్రుతి ప‌రువాల సోయ‌గం వేడెక్కిస్తోంది. ది ట్రూ బార్న్ ఆర్టిస్టు అన్న ట్యాగ్ తో 2021 జ‌న‌వ‌రి క‌వ‌ర్ సంథింగ్ హాట్ గా యూత్ లోకి దూసుకెళుతోంది. ముఖ్యంగా డిజైన‌ర్ థై స్లిట్  ఫ్రాకులో శ్రుతి థై సొగ‌సుల్ని ఎలివేట్ చేస్తూ ఈ ఫోటోషూట్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. ప్ర‌స్తుతం ఈ క‌వ‌ర్ షూట్ ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి.
Tags:    

Similar News