మాస్ మహారాజా రవితేజ - గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ ''క్రాక్''. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ జరుపుకున్న 'క్రాక్' ఫైనల్ షెడ్యూల్ ఇటీవలే తిరిగి ప్రారంభించిన సంగతి తెలిసిందే. హీరో రవితేజ కూడా సెట్స్ లో అడుగుపెట్టినట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ 'క్రాక్' షూటింగ్ ను ఎలా నిర్వహిస్తుందనే విషయాలను తెలియజేస్తూ ఓ మేకింగ్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ మేకింగ్ వీడియో ద్వారా యూనిట్ సభ్యులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించడం.. సెట్స్ లో ఉన్న ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి శానిటైజర్స్ ఉపయోగిస్తూ షూటింగ్ లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న రవితేజ ''స్టేషన్ లో ఉన్నప్పుడు ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టి దొబ్బిచ్చుకో…'' అనే పవర్ ఫుల్ డైలాగ్ చెప్తున్నట్లు వీడియో చివర్లో చూపించారు.
కాగా, సరస్వతి ఫిలిమ్ డివిజన్ బ్యానర్ పై ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. రవితేజ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. తమిళ్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ - సముద్రఖని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ 'క్రాక్' రూపొందుతోంది. 'డాన్ శీను' 'బలుపు' వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత రవితేజ - గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన 'క్రాక్' ఫస్ట్ లుక్ మరియు టీజర్ విశేష స్పందన తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రైలర్ మరియు సాంగ్స్ త్వరలోనే విడుదల కానున్నాయి.
Full View