కంచె కాంబినేషన్ మళ్లీ సెట్టయ్యింది. క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ రెండో చిత్రం చేయబోతున్నాడు. త్వరలోనే మొదలు కానున్న ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈసారి హాలీవుడ్ సినిమాల తరహాలో గూఢచారి కథతో ఓ థ్రిల్లర్ సినిమాని తెరకెక్కించబోతున్నాడు క్రిష్. కంచెని రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కించాడాయన. యుద్ధం అంటే పెద్దయెత్తున బడ్జెట్టు అవసరమవుతుంది. కానీ పక్కా ప్లానింగ్ తో పరిమిత బడ్జెట్ తో ఆ చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకులతో శభాష్ అనిపించుకొన్నాడు క్రిష్.
అందులో వరుణ్ తేజ్ ఒదిగిపోయిన విధానం కూడా చాలా బాగుంది. ఈసారి కూడా అదే ప్లానింగ్ తో ఓ స్పై థ్రిల్లర్ తీయాలని క్రిష్ నిర్ణయించుకొన్నాడు క్రిష్. స్పై థ్రిల్లర్స్ అంటే హాలీవుడ్ లోనే ఎక్కువగా తెరకెక్కుతుంటాయి. ఈ తరహా చిత్రాలకి కూడా భారీగానే బడ్జెట్టు అవసరమవుతుంటుంది. కానీ క్రిష్ మాత్రం కొత్త తరహా ప్లానింగ్ తో పరిమిత బడ్జెట్ లోనే సినిమాని తెరకెక్కించాలని డిసైడ్ అయ్యాడు. కంచె తర్వాత క్రిష్... మహేష్ బాబు - అల్లు అర్జున్ లతో సినిమా చేస్తారని ప్రచారం సాగింది. కానీ ఆ ఇద్దరూ ఇప్పట్లో ఖాళీ అయ్యేలా కనిపించడం లేదు. అందుకే క్రిష్ మళ్లీ వరుణ్ తేజ్ నే ఎంచుకొని సినిమాని తెరకెక్కించబోతున్నాడు. ఇది కూడా ఆయన సొంత బేనర్ లోనే తెరకెక్కే అవకాశాలున్నాయి.