కృష్ణం వందే.. అక్కడే తేడా కొట్టిందట

Update: 2015-10-18 13:30 GMT
‘గమ్యం’ లాంటి గొప్ప సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్. కానీ ఆ తర్వాత ఆ స్థాయికి తగ్గ సినిమాలు అందించలేకపోయాడు. వేదం, కృష్ణం వందే జగద్గురుం మంచి సినిమాలే కానీ వాటిలో ఏదో మిస్సయింది. ముఖ్యంగా క్రిష్ ఎంతో విశేషంగా చెప్పిన ‘కృష్ణం వందే జగద్గురుం’ నిరాశ పరిచింది. అంచనాలకు చాలా దూరంలో ఆగిపోయింది. ఐతే ఆ సినిమాను తాను బాగా తీయలేదని ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు క్రిష్. వేదం తనకు సంతృప్తినిచ్చిన సినిమానే అని.. ‘కృష్ణం వందే..’ మాత్రం సరైన ప్రయత్నం కాదని అంటున్నాడు క్రిష్. ఆ సినిమా ఫ్లాపవడానికి కారణం ఏంటో తనకు తర్వాత అర్థమైందని చెప్పాడు క్రిష్.

‘‘నా సినిమాల ద్వారా ఏదో మంచి చెప్పాలని చూస్తుంటానని చాలామంది అంటుంటారు. ఐతే ఆ మంచి సినిమాలో అంతర్లీనంగా ఉండాలి. కథలోనే ఆ మంచి ఇమిడిపోవాలి. ఏదో చెప్పడానికే సినిమా తీయకూడదు. గమ్యం - వేదం సినిమాల కథల్లోనే విశేషం ఉంది. ఏం చెప్పినా కథల ద్వారానే చెప్పాను. కానీ కృష్ణం వందే జగద్గురుం విషయంలో నేను తప్పు చేశాను. ఏదో చెప్పాలనుకుని సినిమా తీశాను. అలా చేసినపుడు ఆ ప్రయత్నం కృత్రిమంగా తయారవుతుంది. కృష్ణం వందే జగద్గురుం సినిమాను సరిగా తీసి ఉంటే గొప్ప సినిమా అయ్యుండేది. చాలా కష్టపడి యావరేజ్ సినిమా తీశాం. నా దృష్టిలో ప్రేక్షకుడిని తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే వందలు, వేల సినిమాలు చూసిన అనుభవం ప్రేక్షకుడిది. వాళ్ల తీర్పు ఎప్పుడూ తప్పు కాదు’’ అని సెలవిచ్చాడు క్రిష్.
Tags:    

Similar News