మార్కెట్ విస్తరించుకునేందుకు ప్రయత్నించడం.. ఏ వ్యాపారానికి అయినా సహజం. సినిమా అయినా సరే అంతే. మన దేశంలో ఇతర రాష్ట్రాల్లో ప్రయత్నించిన మాదిరిగానే.. ఇతర దేశాల్లో కూడా లక్కును చిక్కించుకునేందుకు ట్రై చేస్తుంటారు మేకర్స్. ముఖ్యంగా చైనా మార్కెట్ ను కొల్లగొడితే.. వందల కోట్లను ఖాతాలో వేసుకోవచ్చని దంగల్ వంటి సినిమాలు ప్రూవ్ చేశాయి.
బాహుబలి2 చిత్రాన్ని కూడా చైనాలో భారీగానే రిలీజ్ చేసినా.. ఖర్చుల వరకూ కూడా రాలేదనే విమర్శలున్నాయి. అక్కడి జనాలకు పీరియాడిక్ మూవీస్.. గ్రాఫిక్ బేస్డ్ సినిమాలు కొత్త కాదు. అందుకే బాహుబలి సినిమాలు అక్కడ చెల్లుబాటు కాలేదు. రాజమౌళి సాధించలేని విజయాన్ని.. తను అందుకునేందుకు మరో టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ రెడీ అయిపోయాడు. ప్రస్తుతం కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మణికర్ణిక చిత్రాన్ని దేశంలోని పలు భాషలతో పాటు.. చైనాలోనూ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు.
రాణీ లక్ష్మీ బాయ్ అంటే వీర నారి అనే విషయం మనకు తెలుసు. చిన్నప్పటి నుంచి పాఠాల్లో చదువుకున్న వ్యక్తి కావడంతో మనకు ఆసక్తి ఉండడం సహజం. మరి ఈ ఫిమేల్ ఓరియెంటెడ్ పీరియాడిక్ మూవీ.. చైనాలో ఎలా చెల్లుబాటు అవుతుందని క్రిష్ ఆశిస్తున్నాడో అర్ధం కావడం లేదని పలువురు బాలీవుడ్ మేకర్స్ చెప్పుకుంటున్నారు.