ప్రస్తుతం అన్ని చోట్లా ఒక్కటే హాట్ టాపిక్. ఎవరు చూసినా రుద్రమదేవి సినిమా గురించో లేకపోతే బ్రూస్ లీ రిలీజ్ గురించి మాట్లాడుతున్నారు. అయితే ఈ రుద్రమ విషయానికొస్తే మాత్రం.. చరిత్రకారులు నొచ్చుకున్న సినిమావాళ్లకు నచ్చకపోయినా ఎవరు ఏమనుకున్న.. మామూలు జనాలకు మాత్రం గోన గన్నారెడ్డి క్యారెక్టర్ తెగ నచ్చేసింది. బన్నీ.. వలనే అరుపులు పెడబొబ్బులూ అన్నట్లుంది సీన్.
మొన్న గమ్యం.. నిన్న వేదం.. ఇప్పుడు కంచె.. ఇలాంటి పదునైన క్రియేటివ్ సినిమాలను రూపొందించిన దర్శకుడు క్రిష్.. ఆల్రెడీ బన్నీ కలసి వేదం సినిమాకు వర్కు చేశాడు. సినిమా నిరాశ పరిచినప్పటికీ.. బన్నీ కెరియర్ లో అదో సూపర్ సినిమా. అయితే మనోడు రుద్రమదేవి సినిమాను చూసి ఇప్పుడు ఫ్లాట్ అయిపోయాడట. 'సాహో గన్నారెడ్డి. మనకో కొత్త రాబిన్ హుడ్ పరిచయం అయ్యాడు. నీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా బన్నీ. అదరగొట్టేశావ్' అంటూ కామెంట్ చేశాడు క్రిష్. మొత్తానికి తన పొగడ్తలతో బన్నీ కి 'కంచె' వేసేశాడనమాట.
ఇకపోతే తనకి కూడా హిస్టారికల్ సినిమాలంటే ఎంతో ఇష్టమని.. ఎప్పటికైనా ఇలాంటి ఓ కథాంశంతో సినిమాను తీయానుకుంటున్నట్లు మనస్సులోని మాటను కూడా చెప్పుకొచ్చాడు క్రిష్. కరక్టే.. క్రిష్ వంటి సూపర్ టాలెంటెడ్ క్రియేటివ్ దర్శకుడు.. హిస్టరీ బరతం పడుతుంటే.. ఆ కిక్కే సెపరేటుగా ఉంటుంది.