తాను ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా తీస్తే దాన్ని చిన్నబుచ్చాలని చూస్తారా అంటూ ఫైరయ్యాడు డైరెక్టర్ క్రిష్. చరిత్రను వక్రీకరించి గౌతమీపుత్ర శాతకర్ణి తీశారంటూ కొందరు చేస్తున్న విమర్శల్ని క్రిష్ మరోసారి తిప్పికొట్టాడు. తాను కళ్లు మూసుకుని ఈ సినిమా తీయలేదని.. ఎంతో పరిశోధించి అనేకమంది సలహాలు తీసుకున్న తర్వాత స్క్రిప్టు తయారు చేసినట్లు క్రిష్ చెప్పాడు.గౌతమీపుత్ర శాతకర్ణిలో కొంత మాత్రమే కల్పన అని.. చాలా వరకు నిజాల్నే సినిమాలో చూపించానని క్రిష్ అన్నాడు.
‘‘తెలుగు చక్రవర్తుల్లో గౌతమిపుత్ర శాతకర్ణి కూడా ఒకడని అన్న విశ్వనాథ సత్యనారాయణ ఆంధ్రప్రశస్తిలో చెప్పారు. నన్ను విమర్శించే వాళ్లకు ఆయన కన్నా ఎక్కువ తెలుసా వారికి? పరబ్రహ్మ శాస్త్రిది తప్పుడు వాదన అంటారా? ఎన్టీ రామారావుగారు కూడా శాతకర్ణి సినిమా చేయాలనుకున్నారు. నిజంగా శాతకర్ణి తెలుగు వాడు కాకపోతే ఎన్టీఆర్ ఆ సినిమా చేయాలని అనుకునేవారా? నేను ఏమీ తెలుసుకోకుండానే సినిమా తీశానని అనుకుంటున్నారా? నేను మరీ అంత సోమరిని కాదు. కళ్లు మూసుకుని సినిమా తీయలేదు. కొన్ని పుస్తకాలు చదివితే వేర్వేరు వెర్షన్లు ఉన్నాయి. వాటన్నింటినీ కలిపి నేను చిన్నపుడు చదువుకున్న కథలోంచి కొన్ని అంశాలు తీసుకుని స్క్రిప్ట్ తయారు చేశాను. సినిమాలో చాలా వరకు నిజాలే చూపించే ప్రయత్నం చేశాను. నన్ను విమర్శించేవాళ్లవన్నీ నిరాధార ఆరోపణలే. నన్ను నా ప్రయత్నాన్ని చిన్నబుచ్చాలని చూస్తున్న వారి విమర్శలకు నేను స్పందించను’’ అని క్రిష్ అన్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/