వరుణ్ తేజ్ లాంటి అందమైన హీరోను నాగబాబు తనకోసమే కన్నట్లున్నాడంటూ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశాడు డైరెక్టర్ క్రిష్. ‘కంచె’ ఆడియో ఫంక్షన్ లో మాట్లాడుతూ క్రిష్ ఈ వ్యాఖ్య చేశాడు. తాను రాసుకున్న ధూపాటి హరిబాబు పాత్రకు వరుణ్ వంద శాతం న్యాయం చేశాడని క్రిష్ అన్నాడు. కంచె కోసం వరుణ్ సహా యూనిట్లో ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారని.. ఆ కష్టానికి ఫలితం దక్కుతుందని నమ్ముతున్నానని క్రిష్ అన్నాడు.
కంచె గురించి చెబుతూ.. ‘‘రెండో ప్రపంచయుద్ధం జరిగిన 70 ఏళ్ల తర్వాత ఆ నేపథ్యంలో సినిమా తీశాను. ఈ సినిమా కోసం యూనిట్ లో ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా వరుణ్ పడ్డ కష్టం అలాంటిలాంటిది కాదు. జార్జియా ప్రభుత్వ అనుమతి తీసుకుని.. వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ కి తగిన విధంగా గన్నులు - ట్యాంకర్ లు - టీ కప్పులు.. ఇలా చాలా ఉపయోగించాం. ఇదో భిన్నమైన కథ అని చెప్పగలను. ఈ కథని పరిపూర్ణంగా ఎలా చెప్పాలో కథ రాసుకున్న తర్వాతే తెలిసింది. మనకు చాలా మంది గొప్ప దర్శకులున్నా ఎందుకో రెండో ప్రపంచయుద్ధం మీద సినిమా తీయలేదు. నేను మిగతా వాళ్లకు భిన్నంగా ఉంటుందని ఈ కథను చెప్పలేదు. మంచి కథ చెప్పాలన్నదే ఈ ప్రయత్నం. ఎవరూ చెప్పని కథను చెప్పడానికి అవకాశమిచ్చిన నిర్మాతలకు, నా కోసమే అందమైన హీరోని కన్న నాగబాబు గారికి ధన్యవాదాలు’’ అని చెప్పాడు క్రిష్.
ఈ వేడుకలో మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా మాట్లాడుతూ ‘‘ఇప్పటి వరకు క్లాస్ మూవీ, మాస్ మూవీ అని మాట్లాడుకుంటున్నాం. ఆ కంచెను ఈ ‘కంచె’ మూవీ చెరిపేస్తుంది. ఈ సినిమాకి చాలా భయం భక్తులతో పనిచేశాను. ఈ మధ్యే క్లైమాక్స్ చూశాను. అది నన్ను ఇప్పటికీ వెంటాడుతూ ఉంది. ఒక అద్భుతమైన సినిమాకి పనిచేశానని గర్వంగా చెప్పుకుంటున్నాను. నాకిది చాలా ప్రత్యేకమైన సినిమా. సీతారామశాస్త్రి అద్భుతమైన సాహిత్యం ఇచ్చారు. మరో జన్మంటూ ఉంటే ఆయన కలంగా పుట్టాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.