ఎన్టీఆర్ బయోపిక్ కోసం `మణికర్ణిక` లాంటి ప్రతిష్ఠాత్మక సినిమానే వదులుకుని వచ్చేశారు క్రిష్. నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో బయోపిక్ ని రెండు భాగాలుగా తెరకెక్కించారు. `కథానాయకుడు` ఇప్పటికే రిలీజైంది. విమర్శకుల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. బాక్సాఫీస్ ఫలితం మాత్రం ప్రతికూలంగానే వచ్చింది. `మహానాయకుడు` ఈ శుక్రవారం రిలీజ్ కి రెడీ అవుతోంది. నేటి సాయంత్రం ఏఎంబీ మాల్ లో ప్రత్యేకించి ప్రివ్యూ వేస్తున్నారని తెలుస్తోంది. నేటి మిడ్ నైట్ కి వన్ వర్డ్ రివ్యూలు వచ్చేస్తాయి. ఎన్టీఆర్ కథతోనే పోటీబరిలో లక్ష్మీస్ ఎన్టీఆర్ వస్తోంది కాబట్టి ఏ సినిమాలో సత్తా ఎంత? అన్న ఆసక్తికర చర్చా సాగుతోంది.
ఈ రిలీజ్ క్రిష్ కి ప్రతిష్ఠాత్మకం. అయితే ఆ తర్వాత క్రిష్ ప్రణాళికలేంటి? అంటే ఓ రెండు ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. ఒకటి సొంత బ్యానర్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ లో సినిమా చేయడం ఎజెండా. కొత్త ముఖాల్ని పరిచయం చేస్తూ ఈ సినిమాని చేస్తారా? లేక ఎవరైనా పెద్ద హీరోతోనే క్రిష్ ఈ సినిమా చేస్తున్నారా? అన్నది తెలియాల్సి ఉంది. అలాగే బాహుబలి సిరీస్ తో సంచలనాలకు తెరతీసిన ఆర్కా మీడియా సంస్థతో ఓ సినిమా చేయాలని క్రిష్ భావిస్తున్నారట. ఇప్పటివరకూ స్క్రిప్టు ఫైనల్ కాలేదు. ప్రస్తుతం ఆ పనిని వేగంగానే పూర్తి చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే క్రిష్ వద్ద కొన్ని స్క్రిప్టులు రెడీగా ఉన్నాయి. వాటికి సానబట్టి ఓకే చేయించుకోవడమే ఆలస్యం అని తెలుస్తోంది.
సున్నితమైన ఉద్వేగాల్ని అద్భుతంగా తెరపైకి తేగలిగే అరుదైన దర్శకుడిగా క్రిష్ కి గుర్తింపు ఉంది. గమ్యం, కంచె, కృష్ణం వందే జగద్గురుమ్ వంటి చిత్రాలు విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడానికి కారణమదే. ఇటీవల కథానాయకుడు చిత్రాన్ని కూడా విమర్శకులు పొగిడారు. అందుకే క్రిష్ ఇప్పటికీ ఇండస్ట్రీ బెస్ట్ డైరెక్టర్లలో ఒకరిగా ఉన్నారు. జయాపజయాలతో పనేలేకుడా కమర్షియల్ సక్సెస్ అన్న మాట లేకుండా అతడిని అభిమానించే వర్గం ఉందంటే అతిశయోక్తి కాదు. మునుముందు అతడి నుంచి వచ్చే సినిమాలు మరింత ఛాలెంజింగ్ గా ఉంటాయని అంతా భావిస్తున్నారు. అర్జెంటుగా క్రిష్ కి ఓ కమర్షియల్ బ్రేక్ కూడా అవసరం అన్న చర్చా సాగుతోంది. మరి క్రిష్ వైపు నుంచి ఆన్సర్ ఏంటో వేచి చూడాలి.