తెలుగు తెరపై కృష్ణ - శోభన్ బాబు హవా కొనసాగుతుండగా, తమదైన ప్రత్యేకతను చాటుకోవాలనే ఉద్దేశంతో మరి కొంతమంది హీరోలు తెరపైకి వచ్చారు. అలాంటివారి జాబితాలో మురళీమోహన్ ఒకరు. కృష్ణతో ఆయనకి మంచి సాన్నిహిత్యం ఉంది.
తాజా ఇంటర్వ్యూలో మురళీమోహన్ మాట్లాడుతూ, కృష్ణ గురించిన విశేషాలను గురించి ప్రస్తావించారు. " కృష్ణగారు .. నేను ఇంటర్ లో క్లాస్ మేట్స్. అప్పట్లోనే ఆయన చాలా అందగాడు. కాలేజ్ లో ఆయనకి మంచి ఫాలోయింగ్ ఉండేది. 'తేనె మనసులు' సినిమాతో ఆయన హీరో అయ్యారు.
ఆ తరువాత కాలంలో నేను ఆయనతో 'వారసుడు' సినిమాను నిర్మించాను. ఆ సినిమాలో కృష్ణగారు .. నాగార్జున తండ్రీకొడుకులుగా నటించారు. సాధారణంగా ఇద్దరు హీరోలు కలిసి నటిస్తున్నప్పుడు .. కథను బట్టి .. పాత్రలను బట్టి మాత్రమే చూడాలి. అలా కాకుండా అభిమానులు గొడవలు చేస్తుంటారు. ఈ సినిమా విషయంలోను అదే జరిగింది. ఆ సినిమాలో తండ్రీ కొడుకులుగా కృష్ణ - నాగార్జున వాదించుకుంటారు. నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటారు. సినిమా రిలీజ్ అయిన తరువాత కృష్ణగారి ఫ్యాన్స్ పెద్ద గొడవపెట్టారు.
కృష్ణగారిని పట్టుకుని నాగార్జున అలా ఎలా మాట్లాడతాడు? అలా అనడానికి వీల్లేదు అంటూ మా ఇంటికి గొడవకి వచ్చారు. కథను బట్టి .. పాత్రలను బట్టి చూడండి .. వాళ్ల వ్యక్తిగత విషయాలుగా కాదు అని నేను చెప్పాను. అది చేస్తాం .. ఇది చేస్తాం .. అంటూ హడావిడి చేశారు.
ఎవరు ఏం చేసుకున్నా ఇక మార్చడం కుదరదు అని చెప్పాను. నిజానికి కృష్ణగారికి ఆ కథ .. ఆ పాత్ర ఎంతగానో నచ్చాయి. ఆ సినిమా చూసిన తరువాత చాలా బాగా వచ్చిందని ఆయన అన్నారు. ఆ విషయమే వాళ్లతో చెప్పిన తరువాత కామ్ గా అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కృష్ణగారి టాపిక్ వచ్చింది కనుక చెబుతున్నాను. ఆయన గొప్ప నటుడు మాత్రమే కాదు .. గొప్ప మనసున్న మనిషి కూడా. సాధారణంగా ఒక సినిమా ఫ్లాప్ అయితే ఆ నిర్మాతను ఇక ఎవరూ పట్టించుకోరు. కానీ కృష్ణగారు అలాంటి నిర్మాతలను కబురు చేసి మరీ పిలిపించేవారు. తమ దగ్గర డబ్బులు లేవనీ .. అందువలన సినిమాలు చేసే పరిస్థితి లేదని ఆ నిర్మాతలు అనేవారు. 'అవన్నీ నేను చూసుకుంటాను .. ముందు మీరు రంగంలోకి దిగండి' అని చెప్పేసి అన్ని రకాలు గా అండగా నిలిచేవారు. అలా ఎంతోమంది నిర్మాతలను కృష్ణగారు ఆదుకున్నారు" అని చెప్పుకొచ్చారు.