బాల‌య్య‌, కృష్ణ‌వంశీ.. ఏంటి సంగ‌తి?

Update: 2016-02-20 17:30 GMT
నంద‌మూరి బాల‌కృష్ణ వందో సినిమా విష‌యంలో ఇప్పుడున్న గంద‌ర‌గోళం స‌రిపోద‌ని.. కొత్త‌గా మ‌రింత క‌న్ఫ్యూజ్ చేసే వార్త‌లు వినిపిస్తున్నాయి. వారం కింద‌ట క్రిష్ పేరు తెర‌మీదికి రాగా.. ఇప్పుడు కొత్త‌గా కృష్ణ‌వంశీ పేరు చ‌ర్చ‌ల్లోకి వ‌చ్చింది. రెండు రోజుల క్రితం కృష్ణవంశీ బాలకృష్ణను కలవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. బాల‌య్య‌తో సినిమా చేయడానికే కృష్ణవంశీ ఆయనను కలిఃశాడ‌ని.. ఓ సోషియా ఫాంట‌సీ క‌థ‌ను కూడా వినిపించాడ‌ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.బాల‌య్య ఈ క‌థ‌ను ఓకే చేశాడా లేదా అన్న‌ది మాత్రం తెలియ‌డం లేదు. ఐతే బాల‌య్య‌ను కృష్ణ‌వంశీ క‌ల‌వ‌డం మాత్రం వాస్త‌వ‌మేన‌ట‌

ఐతే కృష్ణ‌వంశీ ఇప్ప‌టికే దిల్ రాజు నిర్మాణంలో రుద్రాక్ష అనే సినిమాకు క‌మిట‌య్యాడు. అనుష్క‌, స‌మంత‌, ర‌మ్య‌కృష్ణ ఇందులో కీల‌క పాత్ర‌లు పోషిస్తార‌ని.. ఈ సినిమా ఇంకొన్ని రోజుల్లో సెట్స్ మీదికి వెళ్తుంద‌ని అనుకుంటుంటే.. స‌డెన్ గా బాల‌య్య‌తో మీటింగేంటో అర్థం కావ‌డం లేదు.కృష్ణ‌వంశీ సంగ‌త‌లా ఉంచితే.. ప్ర‌తిష్టాత్మ‌క‌మైన వందో సినిమాకు బాల‌య్య‌లో ఈ గంద‌ర‌గోళ‌మేంటో అర్థం కావ‌డం లేదు. బోయ‌పాటి - సింగీతం శ్రీనివాస‌రావు - అనిల్ రావిపూడి - క్రిష్‌ - కృష్ణ‌వంశీ.. ఇలా బాల‌య్య వందో సినిమా రేసులో ద‌ర్శ‌కుల జాబితా పెరిగిపోతూ వ‌స్తోంది. ఇంత‌కీ బాల‌య్య ఎవ‌రితో సినిమా ఖాయం చేస్తాడో? ఎప్పుడు చేస్తాడో?
Tags:    

Similar News