కృష్ణ‌వంశీ వ్య‌వ‌సాయం చేస్తార‌ట‌

Update: 2017-07-27 13:57 GMT
విలువ‌ల‌తో కూడిన సినిమాల‌కి కేరాఫ్ అడ్ర‌స్ కృష్ణ‌వంశీ. ఫ్లాపు హిట్టుతో సంబంధం లేకుండా ఆయ‌న సినిమాలు ప్ర‌త్యేకంగా నిల‌బ‌డిపోతుంటాయి.  గులాబి ద‌గ్గ‌ర్నుంచి ఆయ‌న్నుంచి ప్ర‌తిసారీ చెప్పుకోద‌గ్గ సినిమానే వ‌చ్చింది. ఒకొక్క హీరో గ‌ర్వంగా చెప్పుకొనేలా ఆయ‌న సృష్టించిన పాత్ర‌లుంటాయంటే అతిశ‌యోక్తి కాదు. అయితే కొంత‌కాలంగా ఆయ‌న్నుంచి స‌రైన సినిమా రాలేదు. ఆయ‌న తీసిన న‌క్ష‌త్రం త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ సంద‌ర్బంగా  ఓ ప్ర‌ముఖ ప‌త్రిక‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టాడు. త్వ‌ర‌లోనే వ్య‌వ‌సాయంలోకి దిగ‌బోతున్న‌ట్టు వెల్ల‌డించారు. మెగాఫోన్ చేత‌ప‌ట్టి సినిమాలు తీసిన ద‌ర్శ‌కుడు వ్య‌వసాయం చేస్తాడంటే ఆశ్చ‌ర్యంగా ఉంది క‌దూ! కానీ అది నిజ‌మ‌ట‌.

ఆయ‌న‌కి చిన్న‌ప్ప‌ట్నుంచీ వ్య‌వ‌సాయం అంటే ఇష్ట‌మ‌ట‌. తోట‌లు - చేప‌లు - చెరువుల్లాంటి వాతావ‌ర‌ణం అంటే నాకు చాలా ఇష్ట‌మ‌నీ... అందుకే వ్య‌వసాయం చేయాల‌ని ఎప్ప‌ట్నుంచో అనుకొంటున్నాన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశాడు. మ‌రో  ఐదేళ్ల‌పాటు వేగంగా సినిమాలు చేసి ఆయ‌న పూర్తిస్థాయిలో వ్య‌వ‌సాయం చేస్తాడ‌ట‌. అయితే సినిమాల నుంచి రిటైర్‌ మెంట్ మాత్రం తీసుకోర‌ట‌. చివ‌రిదాకా సినిమాలు తీస్తూనే ఉంటాన‌ని, కానీ రైతుగా జీవితాన్ని గ‌డ‌పాల‌నేది మాత్రం త‌న బల‌మైన కోరిక అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అన్న‌ట్టు అగ్ర ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి కూడా ఇటీవ‌ల పెద్ద‌యెత్తున వ్య‌వ‌సాయ భూమి కొనుగోలు చేసిన‌ట్టు స‌మాచారం. కోట్ల‌కు కోట్లు పారితోషికం తీసుకొనే ద‌ర్శ‌కులంతా ఇత‌ర‌త్రా వ్యాపారాల్లోకి కాకుండా, వ్య‌వ‌సాయంపై దృష్టిపెట్ట‌డమంటే వాళ్ల‌కి మ‌ట్టిపై ఉన్న మ‌మ‌కారం ఎలాంటిదో అర్థం చేసుకోవ‌చ్చు.
Tags:    

Similar News