KVV ట్రైల‌ర్ టాక్ : వెంకీ మామ చెప్పిందే క‌రెక్ట్‌!

Update: 2022-09-10 12:30 GMT
నాగ‌శౌర్య హీరోగా న‌టిస్తున్న రొమ్ కామ్ ఎంట‌ర్ టైన‌ర్ `కృష్ణ వ్రింద విహారి`. అనీష్ ఆర్‌.కృష్ణ ద‌ర్శ‌కత్వం వ‌హించాడు. ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై ఉషా ముల్పూరి నిర్మించారు. గ‌త కొన్ని రోజులుగా వ‌రుస‌గా వాయిదా ప‌డుతూ వ‌స్తున్న ఈ మూవీ ఎట్ట‌కేల‌కు మ‌రో రెండు వారాల్లో అంటే సెప్టెంబ‌ర్ 23న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేశాయి. రొమాంటిక్ ల‌వ్ స్టోరీగా రూపొందిన ఈ మూవీ ద్వారా షిర్లీ సేటియా హీరోయిన్ గా ప‌రిచ‌యం అవుతోంది.

ఇటీవ‌ల రొమాంటిక్ సాంగ్ కి సంబంధించిన మేకింగ్ వీడియోని విడుద‌ల చేశారు. హీరో నాగ‌శౌర్య‌, హీరోయిన్ షిర్లీ సేటియాల మ‌ధ్య కెమిస్ట్రీ బాగా వ‌ర్క‌వుట్ అయిన‌ట్టుగా ఈ మేకింగ్ వీడియోతో స్ప‌ష్ట‌మైంది. అంతే కాకుండా సినిమాలో ఇద్ద‌రి మ‌ధ్య వ‌చ్చే రొమాన్స్‌, రొమాంటిక్ స‌న్నివేశాలు సినిమాకు ప్ర‌ధాన హైలైట్ గా నిల‌వనున్నాయ‌ని తెలుస్తోంది. తాజాగా సినిమా రిలీజ్ ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న్స్ ని స్పీడ‌ప్ చేసింది.

ఇందులో భాగంగా ట్రైల‌ర్ ని శ‌నివారం విడుద‌ల చేసింది. `ప్ర‌తీ సినిమా ముఖేష్ యాడ్ తో మొద‌లైన‌ట్టు ..నా క‌థ వీడితో మొద‌ల‌వుతుంది.. స‌త్య నా డాక్ట‌ర్.. కోమా నుంచి బ‌య‌టికి రావ‌డం వాడికెంత ఇంపార్టెంటో తెలియ‌దు కానీ నాకు మాత్రం చాలా ఇంపార్టెంట్‌` అంటూ నాగ‌శౌర్య వాయిస్, విజువ‌ల్స్ తో ట్రైల‌ర్ మొద‌లైంది. అగ్ర‌హానంలో వుండే యువ‌కుడిగా నాగ‌శౌర్య న‌టించారు. సిటీకి వ‌చ్చి ఎంఎన్‌సీలో ఉద్యోగం సంపాదిస్తాడు. అక్క‌డే అత‌నికి ఓ అంద‌మైన అమ్మాయి (షిర్లీ సేటియా)తో ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది.  

ఆ ప‌రిచ‌యం కాస్తా ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ , పెళ్లికి దారి తీస్తుంది. ఆ కార‌ణంగా స‌నాత‌న ధ‌ర్మాన్ని పాటించే సంప్ర‌దాయమైన బ్రాహ్మ‌ణ ఫ్యామిలీకి చెందిన కృష్ణ ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాడు.. అత‌ని క‌థ ఎలాంటి మ‌లుపులు తిరిగింది అన్న‌దే ఈ చిత్ర ప్ర‌ధాన క‌థ‌. ట్రైల‌ర్ ని చూస్తుంటే రొమాంటిక్ ఫ‌న్ రైడ్ గా క‌నిపిస్తోంది. నాగ‌శౌర్య కామెడీ టైమింగ్‌, షిర్లీ సేటియా మ‌ధ్య కెమిస్ట్రీ ఆద్యంత ఆక‌ట్టుకునేలా వున్నాయి. నాగ‌శౌర్య కు త‌ల్లి పాత్ర‌లో రాధిక శ‌ర‌త్ కుమార్ న‌టించ‌గా బ్ర‌హ్మాజీ, వెన్నెల కిషోర్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, స‌త్య ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు.  

`ఎఫ్ 2`లో వెంకీ మామ చెప్పిందే క‌రెక్ట్‌.. ప్ర‌పంచంలో బాధ‌ల‌న్నీ వాళ్లే భ‌రిస్తున్నామంటారే.. మ‌రి వాళ్ల‌ని భ‌రిస్తున్న మ‌న‌ల్నేమ‌న‌లిరా` అంటూ నాగ‌శౌర్య చెబుతున్న డైలాగ్ లు హిలేరియ‌స్ గా వున్నాయి. మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సాయి శ్రీ‌రామ్ ఛాయాగ్ర‌హ‌నం అందించారు. సెప్టెంబ‌ర్ 23న ఈ మూవీ థియేట‌ర్ల‌లోకి రాబోతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full View
Tags:    

Similar News