అభిమానులు ముద్దుగా డార్లింగ్ అని పిలుచుకునే బాహుబలి ప్రభాస్ కి, పెదనాన్న రెబెల్ స్టార్ కృష్ణంరాజు గారికి ఎంతటి అనుబంధం ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల వరకు తనకు పెదనాన్నే గైడ్ కాబట్టి ప్రభాస్ కూడా ఆయనకు చెప్పకుండా ఏదీ చేయరనే అభిమానులకు కూడా తెలుసు. తన పుట్టిన రోజు సందర్భంగా పలు విషయాలు ముచ్చటించిన కృష్ణంరాజు ప్రభాస్ బాలీవుడ్ సినిమా చేయాలనే ప్లాన్ లో ఉన్నట్టు అసలు తనకు తెలియదని చెప్పి చిన్న షాక్ ఒకటి ఇచ్చారు. గతంలో ప్రభాస్ ఓ ఛానల్ తో మాట్లాడుతూ సాహో పూర్తయ్యాక హిందిలో సినిమా చేసే అవకాశం ఉందని, చర్చలు జరుగుతున్నాయని చెప్పాడు. కరణ్ జోహార్ దాన్ని నిర్మించే అవకాశాల గురించి కూడా పలు కథనాలు వచ్చాయి. దాని తర్వాత మళ్ళి ఆ టాపిక్ మళ్ళి ఎక్కడా రాలేదు.
ఇప్పుడు ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలి అనుకోవడం మీరు చెబితేనే తెలిసింది అని చెప్పిన కృష్ణంరాజు గారు తనతో పాటు మీడియాను కూడా ఆశ్చర్యపోయేలా చేసారు. సాహో తర్వాత ప్రభాస్ తో తన స్వంత బ్యానర్ గోపికృష్ణ మూవీస్ లో ఓ సినిమా ఉంటుందని, అది ఇంకా ఫైనల్ చేయలేదని చెప్పారు. ఒకవేళ ప్రభాస్ చేయాలనుకున్న హింది సినిమాకు అన్ని కుదిరితే కనక తనది వాయిదా వేసి అది పూర్తయ్యాక స్టార్ట్ చేస్తామని కూడా క్లారిటీ ఇచ్చారు. నిజానికి ప్రభాస్ తో సినిమా తీసేందుకు కృష్ణంరాజు గారు నాలుగేళ్ల క్రితమే తన బ్యానర్ మీద 'ఒక్క అడుగు' టైటిల్ తో స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసారని గతంలోనే టాక్ నడిచింది. భక్త కన్నప్పను కూడా ప్రభాస్ తో రీమేక్ చేయాలనే ఆలోచన కొంత కాలం చేసారు కాని ఏవో కారణాల వల్ల డ్రాప్ అయ్యారు.
ప్రభాస్ పెళ్లి గురించి కూడా ఓపెన్ అయిన కృష్ణంరాజు బాహుబలి తర్వాత ప్రభాస్ తన మాట వింటూ ఆలోచిస్తున్నాడని, తగిన సంబంధం దొరకగానే కొత్త కోడలికి మూడు ముళ్ళు వేయించేస్తామని చెప్పారు. కాని ఇంత సమయం లోపు అని మాత్రం చెప్పలేనన్నారు. సంబంధాలు చూస్తున్నామని, ప్రభాస్ కు తగ్గ జోడి అంటే మాటలు కాదుగా అంటూ తెలివిగా తప్పించేసారు కృష్ణంరాజు. సో సాహో తర్వాత బాలీవుడ్ మూవీనా లేక పెదనాన్న సినిమానా అనేది ప్రభాస్ స్వయంగా చెబితేనే క్లారిటీ వస్తుంది.