'ఉప్పెన' బ్యూటీపై మనసు పారేసుకున్న ఉస్తాద్..!

Update: 2021-03-05 13:30 GMT
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో 'ఉస్తాద్' రామ్ పోతినేని - తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి కాంబినేషన్‌ లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ పై శ్రీనివాసా చిట్టూరి ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ని నిర్మించనున్నారు. ఇది ద్విభాషా చిత్రంగా తెలుగు తమిళ భాషల్లో రూపొందనుంది. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మే నెల నుంచి జరగనుంది. తాజాగా '#RAPO19' లో నటించే హీరోయిన్ ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

టాలీవుడ్ సెన్సేషన్ కృతి శెట్టిని రామ్ సరసన హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. 'ఉప్పెన' సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకుంది. ఈ క్రమంలో వరుస ఆఫర్స్ అందుకుంటూ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పుడు '#RAPO19'లో రామ్ కు జోడీగా నటించే అవకాశం దక్కించుకుంది. ఇదిలావుండగా రామ్ కోసం లింగుస్వామి ఓ మాస్ కథను రెడీ చేసారని.. ఇందులో రామ్ సరికొత్తగా కనిపిస్తారని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.


Tags:    

Similar News